//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క‌డ‌ప జిల్లాలో క‌లిసిపోయిన బ‌ద్ద‌శ‌త్రువులు.. ఇక జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తామంటున్నారు..!

Category : politics

జ‌మ్మ‌ల మ‌డుగులో ఆది, రామ‌సుబ్బారెడ్డిల వ‌ర్గాలు క‌లిసిపోవ‌డంతో ఇక వైసీపీకి ప్ర‌మాదం పొంచి ఉందా..? అటే అవున‌నే స‌మాదానం వినిపిస్తుంది. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఇరువురు నాయ‌కులు చేతులు క‌లిపేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మాటిచ్చేశారు. ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా నుంచి ప‌దికి ప‌ది అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల్లో టీడీపీ జెండాను ఎగుర‌వేస్తామ‌ని ప్రతిజ్ఞ బూనారు.

అంతేకాకుండా, క‌డ‌ప జిల్లా టీడీపీ నేత‌లంతా ఇప్పుడు ఒక్క‌తాటిపైకొచ్చారు. ఇదో శుభ‌ప‌రిణామం. మేమంతా క‌లిశాం. ఇక వైసీపీకి నిద్ర ప‌ట్ట‌ద‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి కూడా హెచ్చ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప అంటే రాజ‌కీయంగా ముందుగా గుర్తొచ్చేది పులివెందుల‌. మ‌రి ఇప్పుడు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రీ క‌డ‌ప అయిపోతుందా..? టీడీపీ నేత‌లంతా ఒక్క‌తాటిపైకి రావ‌డంతో వైసీపీ ఇక త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందేనా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇక అస‌లు విష‌యానికొస్తే,.. నాకు ఒక్క అవ‌కాశం ఇవ్వండి, ట్రెండ్‌ను ఫాలో అవ‌డం కాదు.. ట్రెండ్ సెట్ చేసి చూపిస్తా. త‌న తండ్రి పేరు చెప్పుకుని బ‌తుకుతున్న వైఎస్ జ‌గ‌న్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తా. క‌డ‌ప జిల్లాలో వైసీపీ జెండానే లేకుండా చేస్తా అంటూ సీఎం చంద్ర‌బాబును త‌న‌కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల‌ని కోరార‌ట మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి. అయితే, ఇటీవ‌ల కాలంలో మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఆది నారాయ‌ణ‌రెడ్డి పై విధంగా సీఎం చంద్ర‌బాబుతో అన్నారు.

ఇంకా, గ‌తంలో లాగా, క‌డ‌ప టీడీపీ నేత‌ల మ‌ధ్య అభిప్రాయ బేధాలు లేవు. అంద‌రం క‌లిసి పోయాం. స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌నిచేస్తున్నాం. పార్టీ అభివృద్ధికి తోడ్ప‌డే ఆలోచ‌న‌ల‌ను, అభిప్రాయాల‌ను ప్ర‌జ‌ల నుంచి తెలుసుకుని ఒక‌రికొక‌రం షేర్ చేసుకుంటున్నాం. ఈ విధానాన్నే భ‌విష్య‌త్తులోనూ నిరంత‌రం కొన‌సాగిస్తాం అంటూ మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి సీఎం చంద్ర‌బాబుతో చెప్పారు. అంతేకాకుండా, రామ‌సుబ్బారెడ్డికి, త‌న‌కు మ‌ధ్య ఉన్న అభిప్రాయ బేధాల‌న్నీ తొల‌గి పోయాయి. ఇప్పుడు మేమిద్ద‌రం క‌లిసిపోయాం. క‌డ‌ప‌లో టీడీపీ అభివృద్ధికి కావాల్సిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాం. కేవ‌లం పులివెందుల సీటు మాత్ర‌మే కాకుండా, క‌డ‌ప‌లోని ప‌ది అసెంబ్లీ సీట్ల‌ను గెలిచి నీకు బ‌హుమ‌తిగా ఇస్తామంటూ మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ ఓట‌మికి తాను ర‌చించిన ప్లాన్‌ను సీఎం చంద్ర‌బాబు ముందు ఉంచార‌ని, ఆ ప్లాన్‌ను చూసిన చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించిన అనంత‌రం మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Related News