Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాక్‌లో వైసీపీ నేతలు..! టీడీపీ గెలుస్తుందనే సీఎస్ వెనక్కి తగ్గాడా..

Category : state politics

ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఫలితాలు ఈ నెల 23న వెలువడనుండడంతో గెలుపోటములపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమాగా ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు దానికి తగ్గట్టుగా ప్లాన్‌లు వేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, పెన్షన్ల రెట్టింపు వంటి పథకాలను ప్రవేశపెట్టి కాస్త ప్రజలను టీడీపీ వైపు తిప్పేలా చేసుకున్నాడు. అంతేకాదు ఒకవేళ టీడీపీ ఓడిపోయినా అది తన అనుభవానికి పరీక్ష కాకూడదని ముందునుంచే ఈవీఎంలలో లోపాలున్నాయని, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించాలని అన్నారు.

అయితే ఈవీఎంలను జగన్, మోదీ , కేసీఆర్‌లు కలిసి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని చూస్తున్నారని కూడా ఆయన చెబుతూ వచ్చారు. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయినా అది ప్రజల తీర్పు కాదని, కేవలం అవినీతి చేసి గెలిచారని ప్రచారం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు.ఇదిలా ఉండగా మొన్నటివరకు ఒకరిపై ఒకరు విమర్షలు గుప్పించుకున్న చంద్రబాబు, సీఎస్‌లు ఇప్పుడు కాస్త కలిసిపోవడం అందరిలోనూ ఆసక్తి నెలగొంది. అయితే మొన్నటి వరకు ఎన్నికల కారణంతో చంద్రబాబు సమీక్షలకు సీఎస్ దూరంగా ఉంటున్నారు. అంతేకాదు చంద్రబాబు పెడుతున్న ఏ సమీక్షలకైనా ఎన్నికల కోడ్ అమలులో ఉందని వాటికి అనుమతులు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. అందువలన సీఎస్ పై బాబు కాస్త ఆవేశంతో నానా ఆరోపణలు చేశారు. సీఎస్ మోదీ ఎలా చెబితే అలా వింటున్నారని, ఈసీ తీరు కూడా ఏమీ బాగోలేదని మండిపడ్డారు.

అయితే తాజాగా సీఎస్ మాత్రం మొన్నటివరకు అంటీ ముట్టనట్టు ఉండి, తానే నేరుగా వెళ్ళి చంద్రబాబును కలవడం, తాను పెట్టుకుంటున్న చంద్రబాబు సమీక్షలకు సీఎస్ అనుమతులు ఇవ్వడంతో అందరిలోనూ ఇదే చర్చ నడుస్తుంది. అయితే టీడీపీ గెలుపు అవకాశం పక్కాగా ఉంది కాబట్టే చంద్రబాబుకు సీఎస్ మద్ధతు ఇస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Related News