//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత

Category : state politics

టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకపక్క ప్రత్యర్థి పార్టీల నేతలను కార్ ఎక్కించాలని ప్రయత్నం చేస్తుంటే మరోపక్క టిఆర్ఎస్ పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న పార్టీ క్యాడర్ పార్టీని వీడి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఒంటెద్దు పోకడలతో పార్టీలోని కొందరు నేతలు పనిచేస్తున్నారని, దీనివల్ల పార్టీ అభాసుపాలవుతోంది భావిస్తున్న కొందరు నేతలు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో షాక్ తగిలింది.

పార్టీకి చెందిన కీలకనేత ఒకరు టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సార సాంబయ్యతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీని వీడారు. బుధవారం సాయంత్రం వీరంతా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీలోని కొందరు నాయకులు ఒంటెద్దు పోకడలు పోతూ.. పార్టీని ఆబాసుపాలు చేస్తున్నారని.. ఈ విషయమై పలుమార్లు మాజీ ఎమ్మెల్యే పాయం దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరామన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చే రేందుకు మరికొందరు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మొత్తానికి అధికార పార్టీ అయినా సరే పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీ లో చేరుతున్న తీరు టిఆర్ఎస్ పార్టీని ఆలోచించేలా చేస్తోంది. అది కూడా టిఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన ఖమ్మం జిల్లాలో కావడం గమనార్హం.

Related News