//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కవితను లైట్ తీసుకున్న గూగుల్..

Category : politics

తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు క‌విత పేరు చెప్తే చాలు రాష్ట్రంలో జ‌ర‌గ‌ని ప‌నంటూ ఏమీ ఉండ‌దు. 2014 ఎన్నికలలో తెరాస తరుపున ఎంపీగా గెలించింది కవితక్క. ఆమెకు టిఆర్ఎస్ లో ఎంతటి ప్రాధాన్యత ఉందొ కొత్తగా చెప్పక్కరలేదు. ఇక తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియా మేనేజ్ మెంట్ పుణ్య‌మా అని తెలంగాణ‌లోని మీడియా హౌస్ ల‌కే కాదు.. జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని మీడియా సంస్థ‌ల్లోనూ కవిత‌క్క హ‌వా న‌డుస్తుంద‌ని చెబుతారు.

అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ క‌విత రిక్వెస్ట్ చేస్తే చేయ‌ని వాళ్లు ఎవ‌రైనా ఉంటారా? అంటే ఎవరు ఉండరు.అయితే ఆమె మాట‌ను లైట్ తీసుకునేటోళ్లు కూడా ఉన్నార‌ని చెప్పాలి. తెలంగాణ ప్ర‌తి ఏటా ఘ‌నంగా నిర్వ‌హించే బ‌తుక‌మ్మ వేడుకుల సంద‌ర్భంగా బ‌తుక‌మ్మ ను గూగుల్ డూడుల్ గా పెట్టాలంటూ ఎంపీ క‌విత కోరారు. కొద్ది రోజుల క్రితం గూగుల్ ను ఉద్దేశించి ఎంపీ క‌విత మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎంతో సంబ‌రంగా చేసుకునే బ‌తుక‌మ్మ బొమ్మ‌ను గూగుల్ డూడుల్ గా పెట్టాల‌ని కోరారు.

అసలు గూగుల్ అన్న‌ది ప్ర‌పంచం మొత్తాన్ని రిప్ర‌జెంట్ చేసేది. అలాంటి సంస్థ డూడుల్ గా బ‌తుక‌మ్మ‌ను పెడితే.. నిత్యం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే బోలెడ‌న్నిఈవెంట్స్ డూడుల్స్ పెట్టాల్సి రావ‌టం ఖాయం. ఈ కార‌ణంతోనే క‌విత రిక్వెస్ట్ ను గూగుల్ ఏ మాత్రం ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కవిత కోరిక ఒకరోజైతే పర్వాలేదు, బతుకమ్మ సంబరాలు జరిగే తొమ్మిది రోజులు ఆ డూడుల్ ని పెట్టమనడం అత్యాశే అనుకోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని గూగుల్ లైట్ తీసుకుంది. దీంతో కవితక్క మాట విననొళ్ళు కూడా ఉంటారని అర్ధమవుతుంది.