//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గులాబీ నేతల్లో గుబులు ..మంత్రి వర్గ విస్తరణ జాప్యానికి రీజన్ ఏంటో ?

Category : politics state

టిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని దక్కించుకున్నారు. అయితే దూకుడుగా పరిపాలన సాగిస్తారు అనుకున్న కెసిఆర్ రెండు నెలలైనా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పడకేసింది అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయక పోవడానికి గల కారణాలను ఎవరు గులాబీ బాస్ ను అడిగే సాహసం చేయలేకపోతున్నారు.

మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచి మంత్రులుగా తమకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న నేతలు రోజురోజుకీ మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుండడంతో దిగులు చెందుతున్నారు. ఈ టెన్షన్ తట్టుకోలేము మహా ప్రభో అని చెప్పాలని భావించినా మంత్రివర్గ విస్తరణ విషయంలో గుంభనంగా ఉన్న గులాబీ బాస్ ని చూసి మాట్లాడ లేని పరిస్థితిలో ఉన్నారు.

దేశంలో మరే రాష్ట్రంలో చోటు చేసుకోనిరీతిలో.. ఇప్పటివరకూ ఒకే ఒక్క మంత్రితో ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ కారణంగా.. రాష్ట్ర పని తీరు ఇప్పుడు పడకేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది.తమ పార్టీ అధికారంలోకి వచ్చినంతనే తమకు పదవులు లభిస్తాయని ఆశగా చూసిన నేతలకు కేసీఆర్ తీరు షాకింగ్ గా మారింది. ఎవరికి అందుబాటులో ఉండని అధినేత తీరు ఒకటైతే.. మంత్రుల పదవులు కూడా ఇవ్వకుండా ఇలా కాలం గడిపేయటం ఏమిటన్న ఆవేదన పలువురు గులాబీ నేతల్లో కలుగుతోంది. తనకు తోచినట్లుగా చేస్తున్న కేసీఆర్ తీరు కారణంగా.. తమ పదవులకు ముప్పు కలుగుతుందేమోనన్న భయాందోళనలు పలువురు సీనియర్లలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

మరోవైపు.. పదవులు వస్తాయన్న ధీమా ఉన్నప్పటికీ.. లోపల ఏదో అనుమానంతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టెన్షన్ తో తల్లడిల్లిపోతున్నారు. తమ బాధ సారుకు అర్థం కాదా? అన్న క్వశ్చన్ పలువురి నోట వినిపిస్తోంది. దీంతో.. సారు కరుణా వీక్షణాల కోసం గులాబీ నేతలు తపిస్తున్నారు. ఇదిలాఉంటే.. సీఎం కేసీఆర్ మాత్రం గుంభనంగా ఉంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి హాజరైనా తాను చెప్పాల్సిన రెండు మాటలు చెబుతున్నారే కానీ.. పదవుల పంపకం గురించి మాట కూడా చెప్పని పరిస్థితి. దీంతో.. గులాబీ నేతల్లో కిందామీదా పడుతున్నారు.రెండు నెలలు గడుస్తున్నా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకుండా .. అదేమీ పట్టనట్లుగా ఉంటున్న కేసీఆర్ తీరుతో కొందరు సీనియర్ నేతలు అసహనానికి గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది.