//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టిక్ టాక్ కు షాక్ ... 40 కోట్ల జరిమానా

Category : world

టిక్ టాక్ సోషల్ యాప్ సంస్థకు భారీ జరిమానా వేసి అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రతీ ఒక్కరిలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చైనా సోషల్‌ మీడియా యాప్‌ కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్‌ యాజమాన్యానికి ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్(FTC)‌ 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. ఎఫ్‌టీసీ తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్‌ యాజమాన్యం స్పందించింది.

అమెరికా చట్టాలకు అనుగుణంగానే తమ యాప్‌ పని చేస్తోందని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని వెల్లడించారు. 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి స్థాయిలో యాక్సెస్‌ కల్పించలేదని, తమ యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. టిక్ టాక్ యాజమాన్యం సమాధానంతో సంతృప్తి చెందలేదు అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్. పిల్లలకు భద్రత లేకుండా చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానా విధించింది. ఫైన్ కట్టాల్సిందే అంటూ వార్నింగ్ ఇచ్చింది కమిషన్.

సినిమా డైలాగులు, పాటలకు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్‌లోడ్‌ చేసి తమ టాలెంట్‌ను బయటపెట్టేందుకు అవకాశం ఉండడంతో ఈ యాప్ పై ప్రతీ ఒక్కరికీ క్రేజ్ ఉంది.తల్లిదండ్రుల అనుమతి లేకుండా పదమూడేళ్ల లోపు చిన్నారుల ఫొటోలు, పేర్లు తదితర వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచడం ద్వారా టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఎఫ్‌టీసీ. ‘అమెరికాలో దాదాపు 65 మిలియన్ల మంది టిక్‌టాక్‌ యూజర్లు ఉన్నారు. musical.lyతో ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్‌ను చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వినియోగిస్తుండగా పదమూడేళ్ల లోపు చిన్నారుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం అవుతున్నాయి.ఇది అమెరికా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. చిన్నారుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టిక్‌టాక్‌ వంటి మరెన్నో సోషల్‌ మీడియా యాప్‌లకు, సైట్‌లకు ఈ జరిమానా కనువిప్పు కలిగిస్తుందని భావిస్తున్నట్లు ఎఫ్‌టీసీ చైర్మన్‌ జో సైమన్స్‌ వెళ్లడించారు.