//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ .....రోజుకి రూ.20 వేలు మాత్రమే ...!

Category : business

ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలపై ఫిర్యాదులు పెరుగుతుండడంతోపాటు నగదు రహిత, డిజిటల్ లావాదేవీలు పెంచడమే లక్ష్యంగా state bank of india తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం నేటి నుండి అమల్లోకి రానుంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఇకపై రోజుకు గరిష్టంగా రూ. 20 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

గతంలో ప్రకటించిన ఈ కొత్త పరిమితి నిబంధన నేటి నుంచి అమల్లోకి వస్తుంది.

అయితే రూ. 20 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకునేవారు హై వెరియంట్‌ డెబిట్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు అధికారులు సూచించారు.

ఈ నిబంధన కారణంగా దాదాపు 1.42 కోట్ల మంది SBI వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది. అత్యధికమంది రోజుకు రూ.20 వేలకు మించి తీయడం లేదని, అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం కొందరు వ్యాపారులు మాత్రం రూ. 40 వేల వరకూ ఏటీఎంలలో విత్‌డ్రా చేస్తున్నారని తమ పరిశీలనలో తేలిందని అధికారులు తెలిపారు.