//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాజీ ఫోర్న్‌స్టార్ స‌న్నీకి భారీ షాక్‌..!

Category : movies

స‌న్నీలియోన్ మీద క‌న్న‌డ సంఘాలు క‌క్ష‌క‌ట్టాయా..? గ‌త ఏడాది ఆమె షో బెంగ‌ళూరులో జ‌ర‌గ‌కుండా అడ్డుకున్నాయి క‌న్న‌డ ప‌రిర‌క్ష‌ణ స‌మితి సంఘాలు. ఇప్పుడు ఆమె త్రిభాష చిత్ర వీర‌మ‌హాదేవి సినిమాను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. స‌న్నీలియోన్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.

స‌న్నీలియోన్ వీర మ‌హాదేవి అనే ఒక సినిమాలో న‌టిస్తుంది. ఇది నాలుగు భాష‌ల్లో రూపొందుతుంది. తెలుగు, త‌మిళ్ మ‌ళ‌యాళం హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతుంది. వీర‌మ‌హాదేవి క‌థ క‌ర్ణాట‌క‌కు చెందిన ఒక గొప్ప వీర‌నారి జీవితం ఆధారంగా రూపొందుతుంది. దాంతో క‌న్న‌డ సంఘాలు మండిప‌డుతున్నాయి. స‌న్నీలియోన్‌కు వ్య‌తిరేకంగా ఇప్పుడు బెంగ‌ళూరులో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.

స‌న్నీలియోన్‌కు వ్య‌తిరేకంగా క‌ర్ణాట‌క‌లో ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌డం ఇది మొదటిసారి కాదు. గ‌త ఏడాది న్యూ ఇయ‌ర్ సంబ‌రాల్లో డ్యాన్స్ చేసేందుకు స‌న్నీలియోన్ అంగీక‌రించింది. అయితే, స‌న్నీలియోన్ షోను బెంగ‌ళ‌రులోకానీ, క‌ర్ణాట‌క‌లో ఏ సిటీలో నిర్వ‌హించినా ఒప్పుకోబోమ‌ని క‌న్న‌ట సాంస్కృతి ప‌రిర‌క్ష‌ణ సంఘాలు ఆందోళ‌న‌లు చేశాయి. దాంతో స‌న్నీలియోన్ షో ర‌ద్ద‌పోయింది.