//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పీత‌ల సుజాత‌కు ఝ‌ల‌క్ ఇస్తున్న ఆ ఇద్ద‌రు..!

Category : politics

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా దూసుకొచ్చిన లీడ‌ర్ Peethala Sujatha. ఇప్పుడు అంతే వేగంగా ఆమె పొలిటిక‌ల్ కెరియ‌ర్ చుట్టూ ప్ర‌శ్నార్ధ‌కాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌భుత్వ టీచ‌ర్‌గా ప‌నిచేస్తూ TDP కి జై కొట్టారు సుజాత‌. గ‌తంలో ఆచంట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలాంటి ప‌ద‌వి రాకున్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌లో ఆయ‌న‌తో క‌లిసి న‌డ‌వటంతో గ‌త ఎన్నిక‌ల్లో సొంత నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా చింత‌ల‌పూడి నుంచి అవ‌కాశం ఇచ్చారు అధినేత చంద్ర‌బాబు నాయుడు.

గెలిచిన త‌రువాత మంత్రి ప‌ద‌విని కూడా ఇచ్చారు. ఇలా వేగంగా ఏపీ పొలిటిక‌ల్ స్ర్కీన్ మీద దూసుకెళ్లిన Peethala Sujatha అంతే వేగంగా త‌న ప‌ట్టును కోల్పోతూ వ‌చ్చార‌ట‌. ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని, ఏలూరు ఎంపీ మాగంటి బాబుల‌తో ఆమెకు పొస‌గ‌క‌పోవ‌డం అలాగే, వివిధ కోణాల్లో విమ‌ర్శ‌లూ రావ‌డంతో మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు చంద్ర‌బాబు. నాటి నుంచి చింత‌ల‌పూడిలో త‌న ప‌ట్ట నిలుపుకోవ‌డానికి సుజాత చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలించ‌డం లేద‌ట‌.

Peethala Sujatha కు ఈ సారి టికెట్ ల‌భిస్తుందా..? ఆమె ఎక్క‌డ్నుంచి పోటీ చేస్తారు..? అస‌లు హై క‌మాండ్ ఆమెకు టికెట్ ఇస్తుందా..? ఇలా అనేక ప్ర‌శ్న‌లు సుజాత చుట్టూరా తిరుగుతున్నాయ‌ట‌. పార్టీకి విదేయురాలిగా ఉన్నా.. సొంత నియోజ‌క‌వ‌ర్గం.. సొంత వ‌ర్గం లేక‌పోవ‌డం పీత‌ల సుజాత‌కు పెద్ద మైన‌స్‌గా మారాయ‌ట‌. ఒక వైపు ఎలాగైనా 2019లో చింత‌ల‌పూడి టికెట్ ద‌క్కించుకోవాల‌ని సుజాత ఎత్తులు వేస్తున్న వేళ అసమ్మ‌తి నేత‌లు మ‌రింత వేగంగా పావులు క‌దుపుతున్నార‌ట‌.

మాజీ జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌ణ్ కొక్కిరిగ‌డ్డ జ‌య‌రాజ్ అయితే ఈ సారి అధిష్టానం నాకే ఇకెట్ ఇస్తుంద‌ని హ‌మీ కూడా ఇచ్చింద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేసుకుంటున్నార‌ట‌. అలాగే, తాడేప‌ల్లిగూడెం ఆర్టీఓగా ఉన్న విజ‌య‌రాజు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడి నుంచి టీడీపీ త‌రుపున పోటీకి రెడీ అవుతున్నార‌ట‌. ఆయ‌న‌కు చింత‌ల‌పూడిలో గ‌ట్టి ప‌రిచ‌యాలే ఉన్నాయ‌ట‌. ఇక స్థానికంగా Sujatha సామాజిక‌వ‌ర్గానికి చెందిన కొత మంది కూడా టికెట్ కోసం సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నార‌ట‌. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో టికెట్ వార్‌లో అంద‌రికంటే ముందుడాల్సిన పీత‌ల సుజాత రేసులో వెన‌క‌బ‌డిపోతున్నార‌ట‌. జిల్లాలో చింత‌ల‌పూడి, కొవ్వూరు , గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గాలు రిజ‌ర్వుడు స్థానాలు. కొవ్వూరులో మంత్రి జ‌వ‌హ‌ర్ ఉన్నారు. దీంతో ఈ మూడు స్థానాల్లో ఏ టికెట్‌ను సుజాత ద‌క్కించుకుంటారో అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related News