తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తోంది. తెలంగాణాలో ముందస్తు ఎన్నికల జోరు అన్ని పార్టీల్లోనూ మొదలైంది. కొందరు నాయకులు పార్టీలు మారుతుండగా, కొత్త వ్యక్తులు పలు పార్టీల్లో రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరారు. ఈయనతోపాటు మరి కొందరు నాయకులు పార్టీలో చేరారు. గురువారం బండ్ల గణేష్ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీలోని పలువురు సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. బండ్ల గణేష్ గురువారం రాహుల్ గాంధీని కలిశారు.
ఒక కమెడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్…ఓవర్ నైట్ బడా ప్రొడ్యూసర్ గా మారిపోయారు. అయితే ఆయన రాజకీయ నాయకుల బినామీ అంటూ రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చెబుతుంటారు. లేదంటే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంత పెద్ద ప్రొడ్యూసర్ గా ఎలా మారగలడు అనేది అందరి వాదన.
అయితే పవన్ కళ్యాణ్ నాకు దేవుడుతో సమానం, నేను ఆయన భక్తుడిని అంటూ పబ్లిక్ గా ప్రకటనలు చేస్తారు నిర్మాత బండ్ల గణేష్. గాంధీజీ, శివరామరాజులాంటి స్వాతంత్య్ర యోధులతో పవన్ ని పోల్చి పొగుడుతూ ఉంటారు. రాజకీయాల్లో అడుగు పెడితే నేను జనసేన తరపు నుండే పోటీ చేస్తా అని పలుమార్లు ఆయన తెలిపారు. పవన్ అడుగుజాడల్లో జనసేన నుండి ఎంపీగా పోటీ చేస్తానంటూ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు.
ఈథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం పవన్ కి షాక్ ఇచ్చినట్టు అయింది. పవన్ అభిమానుల్లో ఈ విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణాలో కూడా బలమైన నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. ముందస్తు ఎన్నికలు త్వరపడనున్నా ఆయన ఈ విషయంపై స్టాండ్ తీసుకోలేదు. అయితే రానున్న రోజుల్లో తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
#Janasena #Congress #apnews #politics #BandlaGanesh #pawankalyan