ఆ బీజేపీ మంత్రి అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. పబ్లిక్ గా వేదికపై ఓ మహిళా మంత్రి నడుముపై అసభ్యకర రీతిలో చెయ్యి వేశాడు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న వేదికపై చోటు చేసుకున్న ఈ ఘటన దేశం మొత్తాన్ని ఒక సారి షాక్ కి గురి చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి లోని మంత్రి తీరే మహిళల పట్ల ఇలా ఉంటే దేశం ఎటు వైపు పయనిస్తుంది అంటూ ఇది చూసిన ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న వేదికపై మంత్రి మనోజ్ కాంతి దేవ్ మహిళా మంత్రిపై అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపుర మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న సాంతనా చక్మా నడుము మీద చేయి వేసిన సంఘటన కెమెరాలకు చిక్కింది.
దీంతో ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో చేరి వైరల్ గా మారింది. ఓ వైపు ప్రధాని, మరోవైపు ముఖ్యమంత్రి వేదికపై ఉన్న సమయంలో మంత్రి మనోజ్ కాంతి దేవ్ అసభ్యకర రీతిలో మహిళా మంత్రిని తాకడంతో ఇబ్బందిపడ్డ సదరు మహిళా మంత్రి అసహనంతో అతని చేతిని వెనక్కినెట్టింది.అయితే మంత్రి మనోజ్ ప్రవర్తనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.