Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోజాకు క‌ల‌లో ఊహించ‌ని బిగ్‌ షాక్‌.. న‌గ‌రి ఎమ్మెల్యే అభ్య‌ర్థి మార్చిన జ‌గ‌న్‌..!

Category : politics

న‌గ‌రి ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజాకు వైసీపీ అధినేత జ‌గ‌న్ త్వ‌ర‌లోనే భారీ షాక్ ఇవ్వ‌బోతున్నాడా..? అంటే, అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది వైసీపీ వ‌ర్గాల నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో ఒక వెలుగు వెలిగిన రోజా, ఇప్పుడు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే కానుంది అంటున్నారు. పాపం రోజా ఇక జ‌బర్ద‌స్త్‌లో స్థిర‌ప‌డాల్సిందేన‌ని అంటున్నారు. ఆమె ఎంత‌టి ఫైర్ బ్రాండో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అలాంటిది రోజాకు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఎస‌రు త‌ప్ప‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా ఎమ్మెల్యే రోజా ఎంత‌గానో న‌మ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నుంచే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కూ, ప్ర‌స్తుతం న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రోజాకు వైఎస్ జ‌గ‌న్ ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రి టిక్కెట్‌ను రోజు ఇవ్వ‌డం లేదా..? ఈ నిర్ణ‌యం వెనుక జ‌గ‌న్ వ్యూహం ఏమిటి..? ఈ విష‌యాల‌న్నీ తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

ఇక అస‌లు విష‌యానికొస్తే, వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న ఎమ్మెల్యే రోజా ప్ర‌వ‌ర్త‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌సార మాధ్యాల్లో అసెంబ్లీ స‌మావేశాల‌ను వీక్షించే ప్ర‌తీ ఒక్క‌రికి రోజా ప్ర‌వ‌ర్త‌న విధిత‌మే. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ చ‌ట్టాల‌ను చేసే అసెంబ్లీలోలోనే ఆమె ప్ర‌వ‌ర్త‌న అలా ఉంటే.. ఇక న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌యంలో ఆమె వ్య‌వ‌హార శైలి ఇంకెలా ఉంటుందో అన్న అనుమానం రాక మాన‌దు. ఇలా ఆర్కే రోజా త‌న సొంత త‌ప్పిదంతోనే న‌గ‌రి నియోజ‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను కూడ‌గ‌ట్టుకుంది.

ఎమ్మెల్యే రోజా విష‌యాన్ని కొసేపు ప‌క్క‌న పెడితే, ఇటీవ‌ల పాద‌యాత్ర చేస్తూ విజ‌య‌న‌గ‌రంలోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్‌ను ఓ బ‌ఢా పారిశ్రామిక వేత్త క‌లిశాడ‌ట‌. ఆ క్ర‌మంలోనే, నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఉంది, అందుకు ఎంత ఖ‌ర్చైనా ప‌ర్వాలేదు అంటూ త‌న మ‌న‌సులోని కోరిక‌ను జ‌గ‌న్‌ముందు బ‌య‌ట‌పెట్టాడు ఆ పారిశ్రామిక వేత్త‌. అంతేకాకుండా, న‌గ‌రిలో నాకు అనుచ‌రులు ఉన్నారు. న‌గ‌రి చుట్టూరా నా వ్యాపార సంస్థ‌లూ ఉన్నాయి. న‌గ‌రి నుంచి పోటీ చేస్తేనే గెలిచే అవ‌కాశాలు మెండుగా ఉంటాయంటూ పోటీ చేసే స్థానాన్ని కూడా త‌నే ఎంపిక చేసేసుకుని, ఆ విష‌యాన్ని జ‌గ‌న్ ముందు ఉంచాడు.

అస‌లు, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రోజాపై ఉన్న వ్య‌తిరేక‌త‌నుఆ వైసీపీ నేత‌ల ద్వారా తెలుసుకున్న జ‌గ‌న్‌, న‌గ‌రి నుంచి రోజాను త్పించి పారిశ్రామిక‌వేత్తను పోటీ చేయించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. దీంతో పార్టీపై తిర‌గ‌బ‌డుతుందేమోన‌న్న అనుమానం వ‌చ్చిన జ‌గ‌న్ అందుకు త‌గిన మాస్ట‌ర్ ప్లాన్‌ను కూడా రెడీ చేసేవాడ‌ట‌. అదే, ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వే. ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వేలో న‌గ‌రిలో నీ ప‌నిత‌నం బాగా లేద‌ని, అందుకే, నిన్నువైసీపీ అభ్య‌ర్ధిత్వం నుంచి తొల‌గిస్తున్న‌ట్టు రోజాకు చెప్పేందుకు రెడీ అయ్యాడ‌ట జ‌గ‌న్‌. మ‌రి, రోజా వైసీపీపై తిరుగుబాట చేస్తుందో.. లేక ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వేపై న‌మ్మ‌కం ఉంచి జ‌గ‌న్‌ప‌ట్ల విశ్వాసం చూపిస్తుందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Related News