//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోహ్లీ కి మరో షాక్ .... కెప్టెన్‌గా డివిలియర్స్‌..!

Category : sports

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజే వేరు. ఏటా భారీ అంచనాలతో బరిలోకి దిగే ఆ జట్టు ఒక్కోసారి వాటిని అందుకోలేక ప్లేఆఫ్‌కు కూడా చేరడం లేదు. జట్టులో హేమాహేమీలు ఉన్నప్పటికీ 11 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ నేప థ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే ఆ జట్టు కోచ్‌ను మార్చింది. డానియల్‌ వెటోరీ స్థానంలో గ్యారీ కిర్‌స్టన్‌కు బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ ఇంకా బెంగళూరు జట్టుకు విరాట్‌ కోహ్లీ స్థానంలో మిస్టర్‌ 360, ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడట.

2013 నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీనే ఉన్నాడు. టీమిండియాను విజయపథంలో నడిపే కోహ్లీ ఆర్‌సీబీకి మాత్రం విజయాలు అందించలేకపోతున్నాడు.

దీంతో ఆ జట్టు యాజమాన్యం డివిలియర్స్‌కు జట్టు పగ్గాలు అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్‌ ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటానని ఇప్పటికే ప్రకటించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ మార్చి 29 నుంచి మే 19 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.