//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్‌కు క‌ల‌లో కూడా ఊహించ‌ని షాక్‌..!

Category : politics

Telangana లో వేడెక్కుతున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం గ‌తంలో క‌న‌నీ, విన‌నీ పొలిటిక‌ల్ ఎపిసోడ్స్‌కు తెర‌తీస్తోంది. అలాంటి ఆస‌క్తిక‌ర‌మైన స‌మ‌రానికి వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం వేదిక‌వుతోంది. వ‌న‌ప‌ర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా TRS ను మ‌రోసారి ఓడించి తీరాల‌ని శ‌ప‌థం చేశార‌ట‌. కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో ముక్కోణ‌పు పోరు సాగుతుంది. టీఆర్ఎస్ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌డానికి టీఆర్ఎస్ నేత నిరంజ‌న్‌రెడ్డి మ‌రోసారి రెడీ అవుతున్నాడు.

2014లో చిన్నారెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు నిరంజ‌న్‌రెడ్డి. మ‌రోవైపు TDP పొలిట్‌బ్యూరో స‌భ్యుడు రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఆప‌రేష‌న్ ముంద‌స్తు ఎన్నిక‌లు అనేశారు. 2014లో జ‌రిగిన ప‌రాభ‌వానికి బ‌దులు తీర్చుకోవాల‌ని TRS ప‌ట్టుద‌ల‌తో ఉంద‌ట‌. ఈ మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గంలో క్షేత్ర స్థాయి నుంచి కూడా బ‌లం పెంచుకోవ‌డం మీద కూడా గులాబీ దండు ఫోక‌స్ పెట్టింద‌ట‌.

జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి త‌న ప్ర‌త్య‌ర్ధి రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి ఆస‌క్తిక‌ర‌మైన ఆఫ‌ర్ చేస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నుంచి రావుల చంద్ర‌శేఖ‌ర్‌రావుతో పోటీ చేయించాల‌ని, తాను త‌ప్పుకుంటాన‌ని చిన్నారెడ్డి ఆఫ‌ర్ చేశార‌ట‌. వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వర్గంలో రావుల వ‌ర్సెస్ చిన్నారెడ్డి ఎపిసోడ్‌కు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంది. ఇద్ద‌రూ చిర‌కాల ప్ర‌ద్య‌ర్థులు. అలాంటిది వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఇవ్వకూడ‌ద‌ని భావిస్తున్న చిన్నారెడ్డి రావుల పోటీ చేస్తే.. తాను పోటీ నుంచి త‌ప్పుకోవ‌డ‌మే కాకుండా మ‌ద్ద‌తు తెలిపేందుకు రెడీ అంటున్నార‌ట‌.

ముక్కోణ‌పు పోరులో ఓట్లు చీలిపోతే అది TRS విజ‌యానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని ఆ ఛాన్స్ గులాబీ పార్టీకి ఇవ్వ‌కూడ‌ద‌న్న‌ది చిన్నారెడ్డి అభిమ‌త‌మ‌ట‌. దీంతో చిన్నారెడ్డి తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని Congress అధినాయ‌క‌త్వానికి తెల‌ప‌డంతో.. వారు కూడా టీఆర్ఎస్ ఓటమే ల‌క్ష్యంగా రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని పోటీ చేయించేందుకు చిన్నారెడ్డి తీసుకున్న నిర్ణ‌యానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం.

Related News