//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి క్యూ క‌డుతున్న నేత‌లు...!

Category : politics

తెలంగాణ‌లో పోలింగ్ స‌మ‌యం త‌రుముకొస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయాలు తిత్లీ తుఫాన్ బీభ‌త్సాన్ని గుర్తు చేసేలా పార్టీల అదినేత‌ల్లో అల్ల‌క‌ల్లోలాన్ని రేపుతున్నాయి. నిముషాల్లో నేత‌ల రాజ‌కీయ వ్యూహాలు మారిపోతున్నాయి. పార్టీ నుంచి జంపింగ్‌లు, అల‌క‌లు, చేరిక‌లతో ఇలా తెలంగాణ రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మొన్న‌టికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ నేత దామోద‌ర రాజ న‌ర్సింహా స‌తీమ‌ణి ప‌ద్మినీరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ వెంట‌నే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, బీజేపీలో చేర‌డం త‌న అనుచ‌రుల‌కు ఇష్టం లేద‌ని, ఆ కార‌ణంతోనే బీజేపీని వీడి కాంగ్రెస్‌లోనే ఉండ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఇటీవ‌ల కాలంలో సినీ న‌టుడు బాల‌కృష్ణ ఖ‌మ్మం జిల్లాలో ముమ్మ‌రంగా ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. బాల‌కృష్ణ ప‌ర్య‌టన‌ ప్రారంభం నుంచి.. ముగింపు వ‌ర‌కు జిల్లా ప్ర‌జ‌లంతా బాల‌కృష్ణ వెన్నంటే ఉండి జై టీడీపీ నినాదాల‌తో స్వాగ‌తం ప‌లికారు. అంతేకాకుండా, బాల‌కృష్ణ ప్ర‌సంగం ఆద్యాంతం ఎంతో ఆస‌క్తిక‌రంగా విన్నారు. దీంతో ఖ‌మ్మంలో టీడీపీకి ప‌ట్టు ఇంకా ఉంద‌ని నిరూపిత‌మైంది.

అయితే, బాల‌కృష్ణ ప‌ర్య‌ట‌న‌తో టీడీపీ మ‌ళ్లీ బ‌లం పుంజుకోవ‌డంతో చేరిక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. తాజాగా, స‌త్తుప‌ల్లి తాజా మాఈ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య స‌మ‌క్షంలో దాదాపు వంద మంది వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేరారు. వారిలో పాల‌వాడ‌కు చెందిన 60 మంది టీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అలాగే, సండ్ర వెంక‌ట వీర‌య్య సొంత నియోజకవర్గం స‌త్తుప‌ల్లిలోని 11వ వార్డు కౌన్సిల‌ర్ మ‌ల్లూరి ప‌ద్మావ‌తి అంకం రాజు, అంతేకాకుండా, కిష్టాపురం మండ‌ల ప‌రిధిలోని ప‌లు గ్రామాల‌కు చెందిన 40 మంది సండ్ర వెంక‌ట వీర‌య్య స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు.

Related News