//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేసీఆర్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌.. కాంగ్రెస్ లోకి సీనియ‌ర్ సినీ న‌టుడు ఎంట్రీ..!

Category : politics

ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌ది ఏమిట‌య్యా..? అని ఎవ‌రినైనా ప్ర‌శ్నిస్తే వారు త‌డుముకోకుండా, వెంట‌నే చెప్పే స‌మాధానం ముంద‌స్తు ఎన్నిక‌లే అన్న విష‌యం ప్ర‌తీఒక్క‌రికి తెలిసిందే. ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించే తేదీని ప్ర‌క‌టించ‌డంతో పార్టీల నేత‌లంద‌రూ వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. త‌మ పార్టీ త‌రుపున గెలిచే అబ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వెంట‌నే త‌మ పార్టీ 105 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే, మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డ కాంగ్రెస్‌, టీడీపీ, జ‌న‌స‌మితి, ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రు పోటీ చేయ‌బోతున్నార‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. ఇలా ప్ర‌తిప‌క్ష నేత‌లు ఎమ్మెల్యే అభ్య‌ర్థుల లిస్టును రెడీ చేసే ప‌నిలో ఉంటే.. త‌మ‌కే టిక్కెట్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని భాశిస్తున్న ఆశావ‌హులు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు.

అలా ప్ర‌చారం చేస్తున్న వారి లిస్టులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి యాద‌వ్ చేరిపోయారు. త‌న‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాన్ని కాంగ్రెస్ క‌ల్పిస్తుంద‌న్న భావ‌న‌తో భిక్ష‌ప‌తి యాద‌వ్ శేర్లింగంప‌ల్లిలో ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేశారు. త‌న అనుచ‌ర‌గ‌ణంతో శేర్లింగంప‌ల్లిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే, ఆయ‌న సినీ న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను క‌లిశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌నకు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. అయితే, గ‌తంలో సూప‌ర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్ల‌మెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే.

మ‌రో ప‌క్క భ‌క్ష‌ప‌తి యాద‌వ్ కూడా కాంగ్రెస్ పార్టీ త‌రుపున 2009 ఎన్నిక‌ల్లో శేర్లింగంప‌ల్లి నుంచి విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో మాత్రం రాష్ట్ర విభ‌జ‌న ప‌రిస్థితుల వ‌ల్ల ఓట‌మిని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్థి అరికెపూడి గాంధీ శేర్లింగంప‌ల్లి నుంచి విజ‌యం సాధించారు. ఆ త‌రువాత సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సారి శేర్లింగంప‌ల్లి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఆరికెపూడి గాంధీని బ‌రిలోకి దింపింది టీఆర్ఎస్‌. దీంతో ఆరికెపూడి గాంధీపై ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో భిక్ష‌ప‌తి యాద‌వ్ ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా, శేర్లింగంప‌ల్లి టిక్కెట్‌ను కాంగ్రెస్‌కు కాకుండా, టీడీపీ నేత భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్‌కు కేటాయించాల‌ని, ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా అత‌న్నే బ‌రిలోకి దించాల‌ని మ‌హాకూట‌మి ఆలోచన చేస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి, శేర్లింగంప‌ల్లి ఎమ్మెల్యే టిక్కెట్ భిక్ష‌ప‌తి యాద‌వ్‌కు ద‌క్కుతుందా..? లేద భ‌వ్య ఆనంద్‌కు ద‌క్కుతుందా..? అన్న‌ది తెలియాలంటే మ‌హాకూట‌మి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల లిస్ట్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Related News