Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నంద్యాల అభ్యర్థుల్లో టెన్షన్ : SPY రెడ్డి ఆరోగ్యం విషమం

Category : state politics

నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి SPY రెడ్డి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి విషమం అంటున్నారు. జనసేన పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అతను. నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు, అనుచరులు ప్రచారం చేస్తున్నారు నంద్యాలలో.  చికిత్స తీసుకుంటున్నారు. అతని ఆరోగ్యంపై జనసేన పార్టీలో ఆందోళన నెలకొంది. ఆయన వెంటనే కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది..

మూడు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఆరోగ్యం విషమంగా మారటంపై నంద్యాల నియోజకవర్గంలోనూ ఆందోళన నెలకొంది. జనసేన పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి అనారోగ్యం, ఆస్పత్రిలో చికిత్సపై ఇతర పార్టీల అభ్యర్థులు కూడా వాకబు చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నికల కైమాక్స్ లో ఆయనకు ఇలా జరగటంపై నియోజకవర్గంలోని కార్యకర్తలు, నేతలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎండలు మండుతున్నా..

ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాలుగు రోజుల కిందట మొదట వడదెబ్బ తగిలింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ తరలించారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.