Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కర్నూల్ జిల్లాలో వైసీపీకి షాక్ .. టీడీపీలో చేరనున్న గౌరు చరితా రెడ్డి ఫ్యామిలీ?

Category : politics state

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుందా..? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతగా ఉన్న గౌరు చరితారెడ్డి పార్టీ మారడానికి సిద్ధమయ్యారా ? కాటసాని చేరిక తోనే చరితారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత గౌరు చరితకు రాజశేఖరరెడ్డి అంటే అభిమానమే. ప్రస్తుతం ఆమె భర్త వెంకటరెడ్డిలు వైసీపీలోనే ఉన్నారు. అయితే.. రానున్న ఎన్నికల్లో పాణ్యం టీడీపీ టిక్కెట్ ఇస్తామని టీడీపీ నుంచి ఆఫర్ రావడంతో వారిప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే వారిని పార్టీమారేలా చేస్తున్నాయంటున్నారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు భావిస్తున్నారట. పైగా వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్ ను గౌరు చరితకు ఇస్తానని జగన్ ఇంతవరకు హామీ ఇవ్వలేదట. గౌరు చరిత వైసీపికి రాజీనామా చేసి వచ్చే నెల 6వ తేదీన తన భర్తతో పాటు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దీంతో కర్నూలు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరడంతో అలకబూనిన గౌరు ఫ్యామిలీ పార్టీకి గుడ్‌బై చెప్పాలని డిసైడైనట్లు టాక్ వినిపిస్తోంది. గౌరు ఫ్యామిలీ మూడ్రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇదే గనుక జరిగితే కర్నూలు జిల్లాలో వైసీపీ కి పెద్ద దెబ్బ తగిలినట్టే.