//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌కు మ‌రో దెబ్బ‌..!

Category : politics

తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌రం ఊపందుకుంది. రాజ‌కీయ పార్టీల నేత‌లు వారి వారి ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌చార అస్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే రాజ‌కీయ నేత‌ల ఆరోప ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో పొలిటిక‌ల్ హీట్ మ‌రింత పెరుగుతోంది. అంతేకాక, పార్టీల అధినేత‌లు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణ‌యాల‌తో నేత‌ల నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు పార్టీ కండువాను మార్చేందుకు సైతం సిద్ధ‌ప‌డుతున్నారు. ఇలా పార్టీల‌ను వీడుతున్న వారు.. ఇత‌ర పార్టీల కండువాల‌ను క‌ప్పుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్ప‌టికే త‌న పార్టీకి సంబంధించి అభ్య‌ర్థుల‌ను దాదాపు ఖ‌రారు చేసేశారు. మ‌రోప‌క్క టీఆర్ఎస్ ఓట‌మే ల‌క్ష్యంగా ఏర్ప‌డ్డ‌ మ‌హాకూట‌మి త‌న ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించాల్సి ఉంది. Big shock to jagan : YSRCP leader join in TDP

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌ రాకీయాల ప‌రిస్థితి అలా ఉంటే.. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాక‌పోయినా రాజ‌కీయాలు మాత్రం రోమాలు నిక్క‌పొడుచుకునేలా కొన‌సాగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తాను ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభించిన‌ప్ప‌ట్నుంచి మొన్న‌టికి మొన్న కోడిక‌త్తితో జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం వ‌ర‌కు వైసీపీ నుంచి అధికార పార్టీ టీడీపీలోకి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. Big shock to jagan : YSRCP leader join in TDP

ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌లు మ‌రో క‌డ‌ప‌గా పిలుచుకునే శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాకు జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ నేత బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రారెడ్డి టీడీపీలో చేర‌నున్నార‌న్న వార్త ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సోషల్ మీడియాలో క‌థ‌నం ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో ఇటీవ‌ల కాలంలో ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరుకు చెందిన జ‌డ్పీ ఛైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రారెడ్డి భేటీ అయ్యారు. భేటీలో భాగంగా నెల్లూరు అభివృద్ధితోపాటు, రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న‌ రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై దాదాపు గంట‌పాటు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంలోనే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీడీపీలో చేర‌మ‌ని ఆహ్వానించార‌ని, అందుకు స్పందించిన బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రారెడ్డి అతి త్వ‌ర‌లోనే మంచి ముహూర్తం చూసుకుని టీడీపీ కండువా క‌ప్పుకుంటాన‌ని చెప్పార‌ట‌.Big shock to jagan : YSRCP leader join in TDP

అయితే, సీఎం చంద్ర‌బాబు పార్టీలో చేర‌మ‌ని అడిగిన వెంట‌నే బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రారెడ్డి వెంట‌నే ఓకే చెప్ప‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అంతేకాకుండా, చంద్ర‌బాబు నుంచి పిలుపు కోసం బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి ఎప్ప‌ట్నుంచో వెయిట్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ అస‌లేం జ‌రిగింద‌న్నవిష‌యంపై రాజ‌కీయ విశ్లేష‌కులు స‌మాధాన‌మిస్తూ..? బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రారెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా పార్టీ బ‌లోపేతం కోసం ఎంతో కృషి చేశార‌ని, అటువంటి త‌న‌ను కాద‌ని కొత్త‌గా వ‌చ్చిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి వెంక‌ట‌గిరి అసెంబ్లీ టికెట్ కేటాయించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అంటూ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రారెడ్డి త‌న అనుచ‌రుల వ‌ద్ద వాపోయిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.Big shock to jagan : YSRCP leader join in TDP

Related News