Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌కు షాక్‌ : వైసీపీని వీడ‌నున్న కీల‌క నేత‌..

Category : state politics

ప్ర‌స్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ సీనియ‌ర్ నేత సాయి ప్ర‌తాప్ ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు ఆ పార్టీని వీడ‌నున్నార‌న్న‌టువంటి స‌మాచారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో వైర‌ల్‌గా మారింది. అయితే, వైసీపీలో చేర‌క ముందు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా సాయి ప్ర‌తాప్ కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత ఏపీ విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా, స‌మైక్యాంధ్ర కోసం పోరాడిన ముఖ్య నాయ‌కుల్లో ఆయ‌న ముఖ్యుడిగా పేరుపొందారు. ఆ త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక, సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌మక్షంలో సాయిప్ర‌తాప్ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

అలా కాంగ్రెస నుంచి టీడీపీలో చేరిన ఆయ‌న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని వీడి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. అయితే, తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న ఈ నెల 16న వైసీపీకి గుడ్‌బై చెప్పి తిరిగి త‌న సొంత‌గూడు అయిన కాంగ్రెస్‌లో చేర‌నున్న‌ట్టు, ఆ మేర‌కు ఆయ‌న సొంత కార్యాల‌యం నుంచే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Related News