//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ కు భారీ షాక్ ... సబితా తో పాటు ఆరుగురు గులాబీ తీర్ధం

Category : state politics

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఊహించని విధంగా సీనియర్లు సైతం ఓటమిపాలయ్యారు. ఇక ఆ బాధ నుండి బయటపడకముందే కాంగ్రెస్ పార్టీలో టీ పిసిసి అధ్యక్షుడు పై అసమ్మతి పెల్లుబుకుతోంది. బాహాటంగానే నేతలు తిట్టుకుంటూ పార్టీ పరువును మరింత బజారుకీడుస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించే విధంగా కూడా పార్టీలో పరిస్థితి లేదు. ఇక ఇదే సమయం అని భావించి టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. అందులో భాగంగా సంక్రాంతి తరువాత కాంగ్రెస్ పార్టీ నేతలను ఆరుగురిని కార్ ఎక్కించటానికి సిద్ధమైంది. దీంతో నక్క మీద తాటి కాయ పడ్డ చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. ఇక గులాబి తీర్ధం పుచ్చుకోబోతున్నారని తన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారని తెలియడం కాంగ్రెస్ పార్టీని మరింత షాక్ కు గురి చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తో పాటు ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులు గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని వార్త కాంగ్రెస్ పార్టీని కుదేలు చేస్తోంది. పదవుల గాలం వేసి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంటే వారిని ఏ విధంగా ఆపాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇక సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని భావిస్తున్నారు.

సబితా ఇంద్రారెడ్డికి గులాబీ బాస్ మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే తొలి విడత మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఆమెకు అవకాశం దక్కే పరిస్థితి లేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆమెకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కెసిఆర్. ఒకవేళ అది సాధ్యపడకపోతే సబితా ఇంద్రారెడ్డి కుమారుడైన కార్తీక్ రెడ్డి కి చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేస్తే అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు గులాబీ బాస్. ఇక ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో ఉంటే పదవి రాకపోగా కనీసం తన కుమారుడికి ఎంపీగా పోటీ చేసే అవకాశం సైతం రాదు. ఎందుకంటే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఆయనకే కేటాయించే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని కార్తీక్‌రెడ్డి ఆశించారు. అయితే పొత్తులో భాగంగాఆ సీటును టీడీపీకి కేటాయించింది. దాంతో కార్తిక్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి సబిత కుమారుడైన కార్తీక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా భావిస్తున్నారు. ఇక వీరితో పాటుఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ మారే విషయంపై సుధీర్‌రెడ్డి తన సన్నిహిత మిత్రులు, కార్యకర్తలతో ఇప్పటికే చెప్పారని అంటున్నారు. ఇక ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారనిఅంటున్నారు. టాక్ వినిపిస్తోంది.వారితోపాటు నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం ఊపందకుంది. మొత్తానికి సంక్రాంతి తరువాత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీ అయిపోయారు. మొత్తానికి గులాబీ బాస్ వ్యూహం ఫలించింది. ఆపరేషన్ ఆకర్ష్ వర్కవుట్ అవుతోంది.

Related News