//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ రెబ‌ల్ అభ్య‌ర్థుల‌కు మ‌రో షాక్‌..!

Category : politics

మ‌హాకూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు ఎపిసోడ్ దాదాపుగా ముగిసిపోయింది. టీజేఎస్‌, సీపీఐ త‌మ డిమాండ్‌ల విష‌యంలో ఇంకా ప‌ట్టువీడ‌క‌పోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేసేసింది. దీంతో సీట్ల స‌ర్దుబాటు ఎపిసోడ్‌కు తెర‌ప‌డిన‌ట్టే అని కాంగ్రెస్ కండువాలు చెబుతున్నాయి. అదే స‌మ‌యంలో మిత్ర ప‌క్షాల‌కు కేటాయించిన 26 స్థానాలు పోను మిగిలిన 93 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ఒకేసారి కాంగ్రెస్ ప్ర‌క‌టిస్తుంద‌ని అంతా భావించార‌ట‌. కానీ, తెలంగాణ కాంగ్రెస్ వ్య‌హారాల ఇన్‌ఛార్జ్ కుంతియా 4 మంది అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌బోతున్నామ‌న్నారు. దీంతో మిగిలిన 19 స్థానాల‌ను అధిష్టానం ఎందుకు పెండింగ్‌లో పెడుతుంద‌న్న‌ది పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింద‌ట‌.Big shock to congress Rebel leaders

ఈ నెల 12వ తేదీ నుంచి నామినేష‌న్‌ల ప‌ర్వం మొద‌లు కానుంది. 19వ తేదీ నామినేష‌న్ల‌కు చివ‌రి తేది. అంటే ఎన్నిక‌ల స‌మ‌రంలో అత్యంత కీల‌క‌మైన ఘ‌ట్టానికి తెర‌లేవ‌నుంది. అయినా స‌రే 19 స్థానాల‌ను పెండింగ్‌లో ఉంచ‌డం వెనుక పార్టీ హైక‌మాండ్ ఉద్దేశం ఏంట‌న్న అంశం కాంగ్రెస్‌లో టెన్ష‌న్ రేపుతోంద‌ట‌. అత్యంత బ‌ల‌మైన స్థ‌తిలో ఉన్నా.. బ‌ల‌హీన స్థితిలో ఉన్నా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా, స‌వాళ్ల సునామీ ముంచేస్తున్నా కాంగ్రెస్‌లో కొన్ని స‌హ‌జ ల‌క్ష‌ణాలు ఎప్పుడూ సంద‌డి చేస్తూనే ఉంటాయి. వాటిలో ఎన్నిక‌ల వేళ అసంతృప్తి సెగ‌లు ఒక‌టి. పైగా ఇప్పుడు తెలంగాణ‌లో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ నేత‌ల‌తో క‌లిసి పొత్తు పాలిటిక్స్‌కు తెర లేపింది కాంగ్రెస్‌. దీంతో ఈ సారి విజ‌య అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు న‌మ్ముతున్నార‌ట‌.Big shock to congress Rebel leaders

దాంతో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆశావ‌హుల సంఖ్య ఒక రేంజ్‌లో ఉంద‌ట‌. అస‌లు అభ్య‌ర్థుల ఎంపిక ప‌ర్వం ఢిల్లీకి చేర‌గానే ఆశావ‌హులు కూడా దేశ రాజ‌ధానికి ప‌య‌న‌మ‌య్యారు. మాకు గ‌నుక టికెట్ ఇవ్వ‌కుంటే చూసుకోండి అన్న హెచ్చ‌రిక‌ల‌తో కాంగ్రెస్ కార్యాల‌యాల ప‌రిస‌రాలు ఇప్ప‌టికే మారుమోగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆశావ‌హులు అధికంగా టికెట్ వార్ ఒక రేంజ్‌లో సాగుతున్న 19 స్థానాల‌ను పెండింగ్‌లో పెట్టాల‌ని నిర్ణ‌యించింద‌ట పార్టీ అధిష్టానం. 12వ తేదీతో మొద‌ల‌య్యే నామినేష‌న్‌ల ప‌ర్వం 19వ తేదీతో ముగుస్తుంది. తీవ్ర స్థాయిలో టికెట్ వార్ కొన‌సాగుతున్న ఈ 19 స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే టికెట్ ద‌క్క‌ని నేత‌లు అసంతృప్తి సెగ‌లు రాజేస్తారు. రెబల్ అభ్య‌ర్థులుగా బ‌రిలో దిగుతారు. ముందుగానే ఆ స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల కొత్త స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకున్న‌ట్టే అని పీసీసీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. అందుకే, ఆ 19 స్థానాల‌ను పెండింగ్‌లో పెడితే ఎవ‌రెవ‌రికి టికెట్లు వ‌స్తాయ‌న్న స‌స్పెన్స్ అలానే కొన‌సాగుతుంది. నామినేష‌న్ల గ‌డువు ముగియ‌డానికి ముందు వ్యూహాత్మ‌కంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే అసంతృప్తి నేత‌లు తిరుగుబాటు బావుట ఎగుర‌వేసే అవ‌కాశం ఉండ‌ద‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ భావిస్తోంద‌ట‌.Big shock to congress Rebel leaders

Related News