Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ కు వరుస షాకులు ... గులాబీ గూటికి చేరనున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల

Category : politics

కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీ లోకి వెళుతున్న నేతలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపటంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. ఫలితంగా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా నుండి ఓ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నేత నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడ టీఆర్ఎస్‌లో చేరనున్నారు.ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ గూటికి చేరుతామని ప్రకటిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19వ తేదీన కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ఎస్‌లో చేరనున్నారని సమాచారం.

ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. గురువారం నాడు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కేటీఆర్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లో చేరుతానని ఆయన ప్రకటించారు.సబితా ఇంద్రారెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.తాజాగా జాజుల సురేందర్ కూడ టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.

Related News