Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌కు షాక్‌

Category : national politics

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒడిసాలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఝర్సుగుడ ఎమ్మెల్యే నబ కిశోర్‌ దాస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. అయితే శాసన సభ్యత్వానికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు. లోక్‌సభతోపాటు, రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈనెల 25న రాష్ట్ర పర్యటనకు రానున్న పార్టీ అధ్యక్షుడు రాహుల్‌కు ఆయన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో ఎవరితోనూ తనకు విరోధం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార బీజేడీలో చేరుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గ ఓటర్లు అభివృద్ధిని కోరుకుంటున్నారని, వారి నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈనెల 24న బీజేడీలో చేరనున్నట్టు వివరించారు.