//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబుకు షాక్: 2019 ఎన్నికల్లో పోటీకి రాయపాటి దూరం?

Category : politics national

గుంటూరు:గుంటూరు జిల్లా నరసరావుపేట రాజకీయాలు అనగానే మనకి గుర్తుకువచ్చే

పార్టీ తెలుగు దేశం .. గుంటూరు జిల్లా లో తెలుగు దేశం కి మంచి పట్టు ఉంది మొదట నుండి ఇంకా తాజా సమాచారం ఏంటి అంటే సీనియర్ నాయకులూ ఎంపీ రాయపాటి సాంబశివరావు 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే వార్త ఈ మధ్య ప్రచారం సాగుతుంది. సాంబశివరావు తన వారసుడు రంగారావు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట

తరుపున పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రంగారావుకు టిడిపి రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. అనతికాలంలోనే రంగారావు టిడిపి రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకొన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాయపాటి సాంబశివరావు టిడిపిలో చేరారు. 2014 వరకు రాయపాటి గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు. 2014 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ అంగీకరించింది. అయితే ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు కొందరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు అప్పట్లో.

రాష్ట్రం రొండు ముక్కలు అవ్వటం తో ఆ సమయం లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన రాయపాటి సాంబశివరావు తనకున్న అనుభవం తో తెలివిగా 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరారు. టిడిపి నాయకత్వం గుంటూరు పార్లమెంట్ స్థానం కాకుండా నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసే అవకాశాన్ని రాయపాటి సాంబశివరావుకు కల్పించింది.ప్రస్తుతం రాయపాటి సాంబశివవరావు నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి టిడిపి తరపున ఎంపీగా కొనసాగుతున్నారు.

2019 ఎన్నికల్లో పోటీకి రాయపాటి దూరం?

2019 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు ఎన్నికల్లో పోటీకి ఇంకా దూరంగా ఉంటారనే ప్రచారం సాగుతోంది ఈ మధ్య జోరుగా . సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుండా తన వారసుడిని రంగంలోకి దించుతారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

రాయపాటి రంగారావు రంగప్రవేశం చేస్తారా?

2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాయపాటి సాంబశివరావు వారసుడుగా తనయుడు రంగారావు ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. అనతికాలంలోనే టిడిపి రాష్ట్ర కమిటీలో రంగారావుకు చోటు దక్కింది దానికి రంగారావు కొద పూర్తి బాధ్యత వహించారు అని పార్టీ బలం గా నమ్ముతుంది .నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ వ్యవహరాలను రంగారావు తన భుజానవేసుకొన్నారని టిడిపి వర్గాలంటున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు

దీర్ఘకాలం తన తండ్రి సాంబశి వరావు ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన తనయుడు రంగారావు మాత్రం ఎప్పుడూ ఫోకస్‌ కాలేదు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ నాయకత్వ బాధ్యత లు నిర్వర్తించారు. గతంలో కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వ హించారు. అయితే ఇంచుమించు ఏడాది నుంచి రాయపాటి తన వారసుడిగా రంగారావును రంగంలోకి దించారు. తండ్రి ఆశీస్సులతో ఆయన నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పార్టీ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. రంగారావుకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి నరస రావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి రాయపాటి స్థానంలో రంగారావు పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నట్లు పార్టీవర్గాలు మరియు పార్టీ అభిమానులు చెప్పుకువస్తున్నారు చూద్దాం మరి ఏమి చేస్తారో ?

Related News