Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీకి బిగ్ షాక్ : మోడీ ఓట‌మిని తేల్చేసిన ఓట‌ర్లు..!

Category : politics

ఫైన‌ల్స్‌కు ముందు జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్స్ లాంటి మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి త‌లంటు త‌ప్ప‌ద‌న్న‌ట్టుగా సర్వే రిపోర్టులు వ‌స్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీకిషాక్ త‌ప్ప‌దంటున్నాయి స‌ర్వేలు. ఏబీపీ - సీ ఓట‌ర్ సంయుక్తంగా సర్వే నిర్వ‌హించాయి. అధికార బీజేపీని ఆ స‌ర్వే వివ‌రాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. హిందీ బెరిట్‌లో జ‌ర‌గ‌నున్న మూడు హిందీ రాష్ట్రాల్లో బీజేపీ గెల‌వడం క‌ష్ట‌మ‌ని స‌ర్వేలు సందేశాలు ఇస్తున్నాయి.

రాజ‌స్థాన్‌లో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌దంటే.. హ్యాట్రిక్ విజ‌యాల‌తో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల్లో పాల‌న సాగిస్తున్న క‌మ‌లం ఈ సారి వాడిపోనుంద‌ట‌. ఏబీపీ న్యూస్ - సీ ఓట‌ర్ ఈ మూడు రాష్ట్రాల్లో 26,196 మంది ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను సేక‌రించాయి.

రాజ‌స్థాన్‌లో మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ట‌. 49.9 ఓట్ల శాతంతో 142 స్థానాల్లో కాంగ్రెస్ విజ‌యం సాధిస్తుంద‌ని స‌ర్వే చెబుతుంది. గ‌త ఎన్నిక‌ల్లే ఇదే రాష్ట్రంలో భారీ విజ‌యం సాధించిన కాషాయంపార్టీ కేవ‌లం 34.3శాతం ఓట్ల‌తో 56 స్థానాల‌కే ప‌రిమితం కానుంద‌ట‌. ఇక సీఎం అభ్య‌ర్థిగా పీసీసీ చీఫ్ స‌చిన్ పైలెట్‌కు 36 శాతం, ప్ర‌స్తుత సీఎం వ‌సుంధ‌ర రాజేకు 27 శాతం మంది మ‌ద్ద‌తు తెలుప‌గా అశోక్ బెహ్లాకు 24 శాతం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించింద‌ని స‌ర్వే పేర్కొంది. ఈ స‌ర్వే నిజ‌మైతే, రాజ‌స్థాన్‌లో ఆన‌వాయితీ రిపీట్ అయిన‌ట్టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఓసారి గెలిచిన పార్టీ మ‌రోసారి ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ష‌రా మామూలేన‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇక కీల‌క‌మైన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈ సారి షాక్ త‌ప్ప‌దంటున్నాయి స‌ర్వేలు. 230 స్థానాలు ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంటే బీజేపీ 108 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని స‌ర్వే పేర్కొంది. కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 0.7 శాత‌మేన‌ని వెల్ల‌డించింది స‌ర్వే.

కాంగ్రెస్ పార్టీకి 42.2 శాతం, బీజేపీకి 48.5 శాతం ఓట్లు పోల‌వుతాయ‌ని స‌ర్వే తెలిపింది. అయితే, మెజార్టీ ఓట‌ర్లు శివ‌రాజ్ చౌహాన్‌కే మ‌ద్ద‌తు ఇచ్చారు.ఇక చ‌త్తీస్‌ఘ‌డ్‌లో సీఎం ర‌మ‌ణ‌సింగ్ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ల‌భిస్తున్న‌ప్ప‌టికీ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధిస్తుంద‌ని స‌ర్వే అభిప్రాయ‌ప‌డింది. 90 స్థానాలు ఉన్న చ‌త్తీస్‌ఘ‌డ్‌లో కాంగ్రెస్ పార్టీ 39.9 శాతం ఓట్ల‌తో 47 సీట్ల‌లో విజ‌యం సాధిస్తే బీజేపీ 38.2 శాతం ఓట్ల‌తో 40 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని ఏబీపీ - సీ ఓట‌ర్ స‌ర్వే లెక్క‌గ‌ట్టింది. ఓట్ల తేడా స్వ‌ల్పంగా ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పై చేయి సాధిస్తుంద‌ని చెప్పారు. మొత్తంగా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఉవ్విళ్లూరుతున్న కాషాయం పార్టీకి తాజాగా వ‌స్తున్న స‌ర్వే రిపోర్టులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

Related News