//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి బాల్‌రెడ్డికి బిగ్ షాక్‌..!

Category :

అన్నా మీరు చాలా చూశారు.. అంతేకాకుండా వ‌య‌స్సు కూడా పైబ‌డింది.. మీకు టికెట్ ఇచ్చారు.. మీరు స్వ‌చ్ఛందంగా మీరు స్వ‌చ్ఛందంగా త‌ప్పుకుని యువ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తే బాగుంటుంది. టికెట్ రేసులో ఉన్న‌వారిలో ఎవ‌రికి అవ‌కాశం క‌ల్పించినా క‌లిసి ప‌నిచేస్తాం. మీరు పెద్ద మ‌న‌స్సు చేసుకుని దూరంగా ఉండండ‌ని రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ముఖ్య నేత‌లు కొంద‌రు ఆ నియోక‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి బ‌ద్దం బాల్‌రెడ్డిని క‌లిసి వేడుకున్నారు. ప‌నిలో ప‌నిగా పార్టీ సినియ‌ర్ నేత బండారు ద‌త్తాత్రేయ‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ ఆశించిన నేత‌లంతా ప్రస్తుతం ఒక్క జ‌ట్టుగా ఏర్ప‌డ్డారు. పార్టీ అభ్య‌ర్థిగా బ‌ద్దం బాల్‌రెడ్డిని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాడోపేడో ఆయ‌న‌తోనే తేల్చుకోవాల‌ని బీజేపీ నుంచి టికెట్ ఆశించిన నేత‌లంతా స‌రాస‌రి ఆయ‌న బాల్‌రెడ్డి ఇంటికే వెళ్లారు. అన్నా త‌ప్పుకోండి ప్లీజ్ అంటూ అభ్య‌ర్ధించారు.

అయితే, నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ ముఖ్య‌నేతలంతా ఒక్క‌సారిగా రావ‌డంతో బాల్‌రెడ్డి కాస్త ఖంగుతిన్న‌ట్టు తెలిసింది. త‌న‌కు అవ‌కాశం వ‌చ్చినందుకు అంతా క‌లిసి ప‌నిచేద్దామ‌ని ఆయ‌న స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. పార్టీ పెద్ద‌లు బండారు ద‌త్తాత్రేయ, ఇత‌ర ముఖ్య నేత‌ల‌ను క‌లిసి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు.

Related News