Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశ రాజ‌కీయాల్లో మరో సంచ‌ల‌నం..!

Category : state politics

మ‌హారాష్ట్ర ధ‌ర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్‌బెయిల‌బుల్ వారెంట్‌పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఓ ముఖ్య‌మంత్రికి నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ కావ‌డం అరుదైన విష‌యం. అయితే, సీఎంగా ఉండి కోర్టుకు హాజ‌రు కావ‌డం మ‌రో చారిత్రాత్మ‌క అంశం అవుతుంది.Big Sensation in Indian politics

చంద్ర‌బాబుకు జారీ అయిన నాన్‌బెయిల‌బుల్ వారెంట్‌పై గ‌త నాలుగు రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌ల‌న‌లు రేగుతున్నాయి. ఆయ‌న‌పై క‌క్ష తీర్చుకునేందుకు ప్ర‌ధాని మోడీ, మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్నీవీస్ క‌లిసి ప‌న్నుతున్న కుట్ర‌గా టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. బాబు కార‌ణంగా బీజేపీ నేత‌లు కొంత‌కాలంగా ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో కుట్ర‌కు ప్లాన్ చేస్తున్నార‌ని, అందులో భాగంగానే నోటీసులు వ‌స్తున్నాయ‌ని న‌టుడు, రాజ‌కీయ వేత్త శివాజి ఆరోపిస్తున్నారు.Big Sensation in Indian politics 

త్వ‌ర‌లోనే సీఎం చంద్ర‌బాబుకు మ‌రో రెండు కేసుల్లో నోటీసులు జారీ అవుతాయ‌ని కూడా ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే. నాన్ బెయిల‌బుల్ వారెంట్‌పై ఏపీ పోలీసులు, న్యాయ‌వాదుల‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. వారెంట్‌పై కోర్టుకు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆయ‌న స్థానంలో లాయ‌ర్ హాజ‌రై బెయిల్ తెచ్చుకోవ‌చ్చ‌ని, అప్ప‌టికీ కోర్టు అంగీక‌రించ‌క‌పోతే ఏం చేయాల‌నేదానిపై త‌ర్వాత ఆలోచిద్దామ‌ని వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.Big Sensation in Indian politics 

మ‌రో వైపు చంద్ర‌బాబు మాత్రం తాను చ‌ట్టానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని, ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం అన్యాయం చేయ‌లేద‌ని బాబ్లీపై మ‌హారాష్ట్ర స‌ర్కార్ చేప‌డుతున్న అక్ర‌మ క‌ట్టడాల‌తో ఉత్త‌ర తెలంగాణ ఎడారిగా మారుతుంద‌న్న ఆలోచ‌న‌తోనే తాను పోరాడాన‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఇలాంటి అంశాల‌పై కోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చినా.. వెన‌కాడే ప్ర‌స‌క్తే లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. దీంతో కోర్టుకు హాజ‌రై.. త‌న స్టాండ్‌ను మ‌రో సారి వినిపిస్తాన‌ని చంద్ర‌బాబు చెబుతుండ‌గా.. ఉత్త‌ర తెలంగాణ రైతాంగంతో క‌లిసి తాము భారీ ర్యాలీగా చంద్ర‌బాబు వెంట న‌డుస్తామ‌ని తెలంగాణ టీడీపీ నేత‌లు బాహాటంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.Big Sensation in Indian politics

Related News