Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ హత్యకు భారి ప్లాన్

Category : national politics

భారత ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్ట్ లో భారి కుట్ర చేసినట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా దొరికిన ఒక లేఖ ద్వారా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది జనవరి మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉంది. మోదీ రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకుని రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే తమ చర్యలు ఉండాలని హై కమాండ్‌కు మావోయిస్టులు రాసిన లేఖలో ఉంది. నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేయాలని ఇందు కోసం 8 కోట్ల రూపాయలు కావాలని మావోయిస్టు కేంద్ర కమిటీకి తెలిపారు.