//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాక్ ముందు భారీ లక్ష్యం....

Category : sports

అండర్‌-19 ప్రపంచకప్‌‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ భారత్ పాక్‌తో జరిగిన సెమీస్‌లో భారీ స్కోరు చేసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా తమ చిరకాల ప్రత్యర్ధితో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ గిల్అజేయ సెంచరీతో(94 బంతుల్లో ఏడు ఫోర్లతో 102 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా చూడచక్కని ఆటతో ప్రపంచకప్‌లో మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఫలితంగా భారత్ పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీషా(41), మంజోత్(47) జట్టుకు శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 89 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటడంతో పాటు, వికెట్ కీపర్ దేశాయ్(20), రియాన్ పరాగ్(2), అభిషేక్ శర్మ(5) కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది.

ఈ టైంలో వన్ డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్-అనుకుల్ రాయ్ జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడి జట్టు స్కోరును 200 దాటించారు. అయితే రాయ్ 33 పరుగులు చేసి అవుటయ్యాడు. గిల్ సెంచరీ చేరువైన సమయంలో టెయిలెండర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో ఆఖర్లో తీవ్ర ఉత్కఠ నెలకొంది. చివరి బంతికి ఒక పరుగు చేస్తే సెంచరీ పూర్తవుతుందనగా పాక్ బౌలర్ నోబాల్ వేశాడు. ఆ బంతికి రెండు పరుగులు చేసిన గిల్ సెంచరీ పూర్తి చేశాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ మూసా నాలుగు, అర్షద్ ఇక్భాల్ మూడు, అఫ్రిదీ ఒక వికెట్ పడగొట్టారు. అండర్-19 కోచ్ గా ప్రపంచ మేటి ఆటగాడు రాహుల్ ద్రావిడ్ వున్నా విషయం తెలిసిందే.రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో కుర్రాళ్ళు రాటుతేలారు.