//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బారి అంచనాలతో వచ్చి బొక్కబోర్ల పడ్డ సినిమాలు ఇవే

Category : movies

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని హిట్ అయితే మరి కొన్ని ప్లాప్ అవుతున్నాయి. ఇలా బారి అంచనాల మధ్య విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చవి చూసిన కొన్ని చిత్రాలు మనం ఇప్పుడు చూద్దాం.

అజ్ఞాతవాసి

త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 3 వ చిత్రంగా వచ్చిన అజ్ఞాతవాసి బారి అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులని మెప్పించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాభవం పొందింది.

టచ్ చేసి చూడు

అసలే ప్లాప్ లో ఉన్న మాస్ మహారాజ రవితేజ తెలిసి చేసాడో, తెలియక చేసాడో కానీ ఒక నూతన దర్శకుడితో చేసి తన చేతులే కాకుండా నిర్మాత చేతులుకూడా కాల్చాడు.

నాపేరు సూర్య

మంచి రైటర్ గా టాలీవుడ్ టాప్ పొజిషన్ ఉన్న వక్కంతం వంశి తొలిసారిగా మెగాఫోన్ పెట్టుకొని అల్లు అర్జున్ కి మరో ప్లాప్ ఇచ్చాడు.

హ్యాపీ వెడ్డింగ్


నిహారిక ఎప్పటిలాగే హడావిడి చేసింది, సినిమా విడుదలైన తరువాత ఇప్పటివరకు కనిపించలేదు.

కణం


ఈ సినిమా ఎందుకు చేసారో నాగ సౌర్య, సాయి పల్లవి కి కూడా తెలియదు..

నా నువ్వే


పటాస్ ల పేలిద్ది అనుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలేదు..

ఇంటిలిజెంట్


సాయి ధరమ్ తేజ్ ని ఇంటిలిజెంట్ చేద్దాం అనుకున్నాడు పాపం పిచ్చి వినాయక్.

కృష్ణార్జున యుద్ధం


ఒక్క సినిమాలో ఇద్దరు నానీలు ఉండటం వలన ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు.


మెహబూబా


ప్రయోగాలు చేయచ్చుకాని, మరి ఇంత రిస్క్ చేసి ప్రయోగాలు చేయాలిసిన అవసరం లేదు, అది పూరి లాంటి టాప్ డైరెక్టర్.

నేల టికెట్


నిర్మాతకి నేల టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా మిగలలేదు


పంతం


సినిమాలో చూపాలిసిన పంతం ప్రేక్షకులమీద చూపించాడు డైరెక్టర్.


ఆఫీసర్


ఎప్పటిలాగే రామ్ గోపాల్ వర్మ తన పైత్యం చూపించాడు.


లవర్


ఈ లవర్ సినిమా ద్వారా దిల్ రాజు కి లవర్ లాంటి సక్సెస్ ట్రాక్ బ్రేక్ అప్ అయ్యుంది


శ్రీనివాస కళ్యాణం


పెళ్లిళ్లు మీద పాటలు కావాలంటే ఓ ఆల్బమ్ చేపిచ్చుకుంటే సరిపోయేది. కానీ ఒక పాట కోసం సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు దిల్ రాజు,


తేజ్ ఐ లవ్


తమిళ్ దర్శకుడు కరుణాకరన్ తోలి ప్రేమ లాంటి సినిమాలు తొలిసారి మాత్రమే తీయగలడని మన తెలుగు నిర్మాతలు ఎప్పుడు గ్రహిస్తారో.


@నర్తనశాల


ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు పొందుతున్న నాగ సౌర్య ఈ ప్రయోగాలు చేయడం అవసరమా..

నోటా


ఓవర్ నైట్ టాప్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ అదే ఓవర్ నైట్ లో డిజాస్టర్ హీరో అయ్యాడు (అన్నయ్య అప్పుడే రాజకీయాలు మనకెందుకు)