//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బ్రేకింగ్ : ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే..ఆర్‌కే రోజా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Category : state politics

ఈ ఏడాది ఏప్రిల్ 11న హోరా హోరీగా జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఓట‌ర్లు వారి వారి తీర్పును ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రోప‌క్క ఈ నెల 23న వెలువ‌డ‌నున్న ఎన్నిక‌ల ఫలితాలలో గెలుపు త‌మ‌దంటే.. త‌మ‌ద‌ని అటు టీడీపీ, ఇటు వైసీపీ ఇరు పార్టీల శ్రేణులు ధీమాతో ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లో టీడీపీతో పోలిస్తే అధికారంలోకి రావ‌డం ప‌క్కా అంటూ వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉంది.ఇలా అధికారం త‌మ‌దేనంటూ గ‌ట్టి న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్న వైసీపీ నేత‌ల‌ను చూసి కార్య‌క‌ర్త‌లు సైతం ఫుల్ జోష్‌లో మునిగితేలుతున్నారు. అదే అదునుగా భావించి, రాబోయేది ఎలాగో త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని, ఆ లెక్క‌న వైఎస్ జ‌గ‌న్ ఎలాగో ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌డ‌తారు కాబ‌ట్టి, ఇక మిగిలింది ఆయ‌న మంత్రివ‌ర్గంలో ఎవరెవ‌రికి చోటు ద‌క్క‌నుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌పై కార్య‌క‌ర్త‌లు చ‌ర్చ‌ల‌ను ప్రారంభించారు.

జిల్లాల వారీగా ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ కేడ‌ర్ ఈ లెక్క‌ల‌ను వేస్తోంది. ఇటువంటి అంశ‌మే కృష్ణా జిల్లా వైసీపీ శ్రేణుల్లో కేబినేట్ క‌ల‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయ‌ట‌. జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ అభ్య‌ర్ధుల చుట్టూ కూడా మంత్రి ఎవ‌రు కాబోతున్నార‌న్న అన్న అంశంపై చ‌ర్చ తీవ్ర స్థాయిలో జ‌రుగుతోంది.అయితే, ఆర్‌కే రోజా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. దివంగత మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కుమారుడు గాలి భాను ప్ర‌కాష్‌పై ఈ సారి ఆర్‌కే రోజా పోటీచేశారు. వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత నమ్మకస్థులలో ఒక‌రుగా ఆర్‌కే రోజాకు పేరుంది. అలాగే పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నేత‌ల్లో ఒక‌రుగా, కీల‌క నిర్ణయాలు తీసుకునే నేత‌గా, సబ్జెక్ట్ ఉన్న నేత‌ల్లో ఒక‌రిగా ఆర్‌కే రోజాకు పేరుంది. ఇలా అన్ని అర్హ‌త‌లు ఉన్నఆర్‌కే రోజాకు వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే మంత్రి ప‌ద‌వి వ‌ర్గం ఖాయ‌మ‌ని ఆమె అనుచ‌ర‌వ‌ర్గం చెబుతోంది.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాగానే,ఆర్‌కే రోజాకు హోం మంత్రిత్వ శాఖ బాధ్య‌త‌లు అప్ప‌చెప్ప‌డం ఖాయ‌మ‌ని ఆమె వ‌ర్గం జిల్లాలో విస్తృత స్థాయిలో ప్ర‌చారం చేస్తోంది.ఇదిలా ఉండగా, వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్ జ‌గ‌న్ త‌న‌కు హోం మంత్రిత్వ శాఖ‌ను కేటాయిస్తారంటూ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఆర్‌కే రోజా స్పందించారు. వైసీపీలోకి అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని, అయితే, త‌న‌కు వైఎస్ జ‌గ‌న్ త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా, ఇవ్వ‌కున్నా జగ‌న్ వెంటే త‌న అడుగులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.కాగా, ఒక‌వేళ మీరు గెలుపొంది.., వైసీపీ అధికారంలోకి వ‌స్తే జ‌గ‌న్ నుంచి ఏ ప‌ద‌విని ఆశిస్తున్నార‌ని ఆర్‌కే రోజాను అడిగిన మీడియాకు ఆమె స‌మాధానం ఇచ్చారు. ఏప్రిల్ 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే ల‌క్ష్యంగా తామంతా ప‌నిచేశామ‌ని, తాము ప‌డ్డ క‌ష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ప్ర‌జ‌లు వైసీపీని ఆశీర్వ‌దించార‌ని, ఆ ఫ‌లితాలే మే 23న వెలువ‌డ‌నున్నాయ‌ని ఆర్‌కే రోజా తెలిపారు.

ఇక త‌న‌కు జ‌గ‌న్ సీఎం అయితే మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె స్పందించారు. ఆ విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకున్నా శిరస్సు వ‌హిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను రాజ‌కీయాల్లో ఉన్న‌న్ని రోజులు వైసీపీలోనే ఉంటూ, జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తామ‌ని ఆర్‌కే రోజా చెప్ప‌డం విశేషం.