//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బ్రేకింగ్ ...నెక్స్ట్ టార్గెట్ గా గల్లా జయదేవ్ ....తిరగబడటానికి సిద్దమౌతున్న చంద్రబాబు ...!

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కోతరంగు పులుముకుంటుంది . ప్రస్తుత ఏపీ పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఏపీ లో మరొకసారి టీడీపీ అధికారాన్ని చేపట్టడం ఖాయం గా కనిపిస్తుంది . దీనితో బీజేపీ కుట్రలకు దారితీసింది . మొన్న బీదా మస్తాన్ రావు ,నిన్న పోతుల రామారావు , మాజీ మంత్రి సుజనా చౌదరి . నేడు సీఎం రమేష్ ..ఇలా చుస్తే రేపెవరు అని అందరూ ఆలోచిస్తున్నారు . మోడీ ఆగ్రహానికి ఐటీ దాడులు ఎదుర్కోబోతున్న ఆ టీడీపీ నేత ఎవరు అని చర్చలు జరుగుతున్నాయి .అందరూ కూడా భారీగా వ్యాపారాలున్న గుంటూరు సింహం , పార్లమెంట్ లో తన ప్రసంగం తో మోడీ గుండెల్లో సైతం వణుకు పుట్టించిన గల్లా జయదేవ్ అని చెప్పుకుంటున్నారు .

మిస్టర్ ప్రిమినిస్టర్ అంటూ పార్లమెంట్ లో గల్లా గర్జించిన తీరు ఇప్పటికి మోడీ చెవ్వుల్లో మారుమోగుతూనే ఉంటాయి .అందుకే అందరి తో పాటుగా గల్లా జయదేవ్ ని కూడా టార్గెట్ చేసాడని , ఈ మేరకు ఇప్పటికే అన్ని సిద్దమయ్యాయని ఢిల్లీ లో ప్రచారం ఊపందుకుంది . లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పై మోడీ చేసిన వ్యాఖ్యలని ఇప్పటికి టీడీపీ నేతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు . ఏపీ లో టీడీపీ ,వైసీపీ పన్నిన ఉచ్చులో చిక్కుకుంది అని మోడీ చేసిన వ్యాఖ్యలని ఈ సందర్భంగా తెలుగు దేశం నేతలు తెర పైకి తీసుకువచ్చారు . అప్పుడే మిస్టర్ జయదేవ్ మీ సంగతి ఏంటో చూస్తానని మోడీ హెచ్చరించారు కూడా , ఈ దైర్యం తోనే ఏపీ బీజేపీ నేతలు ,టీడీపీ నేతలకి చుక్కలు చూపిస్తున్నారు .

వచ్చే ఎన్నికల్లో ఏపీ లో టీడీపీ 40 సీట్ల లోపే పరిమితం చేస్తామని , తమ వ్యూహాలు ,తమకి ఉన్నాయని చెప్పుకొచ్చారు .అమరారాజ బ్యాటరీస్ తో పాటుగా మరిన్ని వ్యాపారాలు చేస్తున్నారు గల్లా కుటుంబం . అక్కడ ఉండే ఎదో ఒక లొసుగు వెతికే గల్లా బెండు తీయచ్చు అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది .దీనికోసమే గల్లా పై రైడ్ కోసం 400 మందికి పైగా అధికారులని రెడీ చేస్తునట్టు సమాచారం . దీనిపై చంద్రబాబు కూడా పక్కా వ్యహం తో ముందుకు పోవాలని దృఢ సంకల్పం తో ఉన్నట్టు తెలుస్తుంది . ఏది ఏమైనా గల్లా ని టచ్ చేస్తే టీడీపీ సెగ ..కేంద్రం పై పడుతుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు .