//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జబాంగ్‌ నుంచి బిగ్‌ బ్రాండ్‌ సేల్‌

Category : business

గత రెండు నెలలుగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోగా తాజాగా జబాంగ్‌.కామ్‌ కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ ఫ్యాషన్‌ మార్కెట్‌ మూడు రోజుల పాటు (29 నుంచి 31 వరకు) ఆఫర్లను అందిస్తున్నది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ బ్రాండులు పెద్దఎత్తున ఆఫర్లను అందిస్తున్నాయి.

బిగ్‌ బ్రాండ్‌ సేల్‌ పేరిట తీసుకొస్తున్న ఈ సేల్‌లో అడిదాస్‌, లెవిస్‌, పుమా, జాక్‌ అండ్‌ జోన్స్‌ తదితర బ్రాండులు 40 నుంచి 71 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ కార్డులు వినియోగించి కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌, మోబీ క్విక్‌తో చెల్లిస్తే 10 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

దీంతో పాటు మలేసియా ట్రిప్‌, వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జబాంగ్‌ తెలిపింది. రూ.400 కోట్ల విలువైన వస్తువులను అమ్మకానికి ఉంచామని, ఈ ఆఫర్‌తో కంపెనీ ఆదాయం కొన్ని రెట్లు మేర పెరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అర్ధరాత్రి నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.