//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగు బిగ్‌బాస్.. సెకండ్ సీజ‌న్ య‌మా హాట్ గురూ..!

Category : movies

తెలుగు బుల్లితెర స్టార్ మా ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రొడ్యూస్ చేసిన‌ బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్‌గా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు సిద్ధమవుతుంది. ఈ సీజన్ లో నాని బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించనున్నాడని స‌మాచారం. నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ఈ రియాలిటీ షో నడుస్తుందట ఇప్ప‌టికే మా వ‌ర్గాల నుండి టాక్ వ‌చ్చేసింది. అంతే కాకుండా ఈ సీజ‌న్‌లో కంటెస్టంట్స్‌గా నిత్యం వార్తల్లో ఉన్న వారిని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇక వారిలో ఒకప్పుడు లవర్ బోయ్ గా సూపర్ క్రేజ్ ను దక్కించుకున్న తరుణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక క్రేజీ సింగర్ గీతా మాధురి కూడా ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో ఉండనుందట. అంతేకాదు యాంకర్ శ్యామలా, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి కూడా బిగ్ బాస్ సీజన్ 2లో పాటిస్పేట్ చేస్తున్నారట. వీరితో పాటు గజాలా, తేజశ్వి మడివాడా కూడా కంటెస్టంట్స్ గా ఉండబోతున్నారట. మొత్తానికి మొదటి సీజన్ లో లాగా కాకుండా సెకండ్ సీజన్ లో క్రేజీ స్టార్స్ బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొంటున్నారు. ఈ లిస్ట్ చూస్తుంటే సీజన్-2 మరింత మజా ఇవ్వనుందని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ -1 కన్నా ఈ సీజన్-2లో రూల్స్ ఇంకా కఠినతరంగా ఉండనున్నాయట. మరి మొదటి సీజన్ లాగా ఈ సెకండ్ సీజన్ సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2 షూటింగ్ కు అన్ని సెట్ చేశారని స‌మాచారం.