//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ శ్యామల సంచలన వ్యాఖ్యలు...!

Category : movies

బిగ్‌ బాస్‌ ఇంటిలో నడుస్తున్న వ్యవహారాలు స్క్రిప్ట్‌ మాత్రం కాదని, అలాగని అవి ప్రేమలుగా చెప్పలేమని ఈ ఆదివారం ఎలిమినేషన్ లో బయటకు వచ్చిన శ్యామల చెప్పారు. 'బిగ్‌బాస్‌ ఇంట్లో ఏదైనా జరగొచ్చనడానికి నేనే ఉదాహరణ. నేను ఇంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదు.

బిగ్‌బాస్‌ షోలో గెలవడానికి ఏది ప్రమాణికం. ఇంటిలో వారి ప్రదర్శనా లేక వారి వ్యక్తిత్వమా? లేక చాకచక్యంగా వ్యవహరించడమా? అని అడిగిన ప్రశ్నకు విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. వ్యక్తిత్వమే ప్రధానమైన అంశం. నటన ద్వారా షోను గెలవడం అసాధ్యం. 24 గంటలూ ఎవరూ నటించలేరు.

ఏదో సందర్భంలో అసలు స్వరూపం బయటపడుతుంది. అందుకే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు దాన్ని ప్రదర్శించాలి. అది ప్రేక్షకులకు నచ్చితే వారు గెలుస్తారు అని చెప్పారు. తన వ్యక్తిత్వ ప్రదర్శనకు పూర్తి అవకాశం లభించలేదని, ఇంకొంతకాలం ఇంటిలో ఉండివుంటే తనకు ఆ అవకాశం లభించేదేమో అని శ్యామల అభిప్రాయపడ్డారు.

దీప్తితో తనకు ఏర్పడిన బంధం గురించి చెబుతూ.. ఇంటి లోపలికి వెళ్లేదాకా ఆమెతో ఎప్పుడూ పరిచయం కూడా లేదని చెప్పారు. ఇద్దరి వ్యక్తిత్వాలు కలవడం వల్లే అంత దగ్గరయ్యామని అన్నారు. ఇక గణేష్‌ను 'రారా..పోరా' అని పిలిచేంతలా దగ్గరయ్యాడని, తాను అలా పిలవగలిగిన ఏకైక వ్యక్తి గణేషేనని శ్యామల తన అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.