//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ సెకండ్ సీజ‌న్‌.. నిరాశ త‌ప్ప‌దా.. రేపుతున్న‌ అనుమానాలు..!

Category : movies

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ ఈ ఆధివారం నుండి ప్రసారం కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్ల కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. వారం క్రితం రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేష్, సీనియర్ హీరోయిన్ రాశి, శ్రీదేవి విజయ్ కుమార్, గజాలా, ధన్య బాలకృష్ణన్, చాందిని చౌదరి, బిత్తిరి సత్తి వంటి వారు పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపించేసరికి అందరు ఈసారి మసాలా అదిరిపోవడం ఖాయమని అనుకున్నారు.

అయితే తీరా ఇప్పుడు అధికార లిస్ట్ చూస్తే అందరికి దిమ్మతిరిగిపోవడం ఖాయం..కనీసం అందరికి గుర్తుండిపోయే వారు సగం మంది కూడా లేకపోయేసరికి ఈసారి ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగర్ గీతా మాధురి.. టీవీ 9 యాంకర్ దీప్తి.. హీరో తనీష్.. సోషల్ యాక్టివిస్ట్ బాబు గోగినేని.. యాంకర్ శ్యామల.. నటుడు సామ్రాట్.. నటి తేజస్వి.. కాస్త పరిచయస్తులే, ఇక భాను.. రోల్ రిధా.. కృతి దామరాజు.. దీప్తి సునైనా.. కౌశల్.. అమిత్ తివారి.. గణేష్.. సంజన.. నూతన్ నాయుడు అనేవాళ్లు పార్టిసిపెంట్ల జాబితాలో ఉన్నారు. వీళ్లెవరూ జనాలకు పరిచయం లేని వాళ్లే. ఇలాంటి వారు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.