//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్‌బాస్ సీజన్ 3 త్వరలోనే క్లారిటీ ఇచ్చేసిన "స్టార్ మా"

Category : movies

ఎప్పటి నుంచో వస్తున్న ఊహాగానాలు హోస్ట్ పేరుతో పాటు కంటెస్టెంట్ల పేర్లపై చర్చ.. ఏది నిజమో, ఏది అబద్దమో మనకు ఏ మాత్రమూ తెలియదు.ఈ మధ్య సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల పేర్లపై మాత్రం చాలా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన ఈ రియాలిటీ షో యొక్క రెండు సీజన్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో మూడో సీజన్‌ కోసం ఆసక్తిగా అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ ఊహాగానాలు అన్నీ పక్కన పెడితే అసలు ‘బిగ్‌బాస్ 3’ షో ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు కూడా ఇప్పుడు ఒకవైపు వ్యక్తమవుతున్నాయి అయితే ఇక ఈ అనుమానాలకు తెరపడనుంది దీనిపై తాజాగా స్టార్ మా క్లారిటీ ఇచ్చేసింది. బిగ్‌బాస్ సీజన్ 3 త్వరలోనే ప్రారంభం కాబోతోందంటూ ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది.అయితే విడుదల చేసిన ఈ ప్రోమోలో కూడా బిగ్‌బాస్ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం కాబోతోందనే విషయాన్ని మాత్రం వీరు వెల్లడించలేదు.అయితే త్వరలో ప్రారంభం కాబోతోందని మాత్రం స్టార్ మా వెల్లడించింది. ఏది ఏమైతేనేమి బిగ్‌బాస్ 3 ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు మాత్రం ఇక తొలిగిపోయాయి.అయితే ఈ షోకి హోస్ట్‌గా నాగార్జున చేస్తున్నారని తెలుస్తోంది