భువనేశ్వర్ కుమార్ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండరు.ఇప్పుడు ఉన్న భారత టీం లో మోస్ట్ పవర్ ఫుల్ బౌలర్.ఇప్పుడు జరుగుతున్నదక్షిణాఫ్రికా సిరిస్ లో కూడా ఆతను రాణిస్తున్నాడు.భువి బౌలింగ్ కి సరిపడే స్వింగ్ పిచ్ ల ఫై చెలరేగుతున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత పేసర్ భువనేశ్వర్ మరోసారి చెలరేగిపోయాడు. తొలి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ ఓపెనర్ మార్క్రం(2)ను పెవిలియన్ బాట పట్టించిన భువీ.భువి టీం లో తన పాత్రకి న్యాయo చేస్తున్నాడు.
రెండో రోజు ఆరంభంలోనే మరో ఓపెనర్ ఎల్గర్(4) వికెట్ తీశాడు. భువనేశ్వర్ వేసిన 13వ ఓవర్ మూడో బంతికి ఎల్గర్ కీపర్ పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసి భారత్ కంటే 158 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్‌లో రబాడా(11), ఆమ్లా(2) ఉన్నారు.