Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భీష్మ సినిమా షూటింగ్ స్టార్ట్....!

Category : movies

తన మొదటి చిత్రంతోనే సూపర్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల. 'ఛలో' సినిమా ఇచ్చిన విజయంతో ఈ దర్శకుడు మరో సూపర్ కాంబినేషన్ ని తెరమీదికి తీసుకొచ్చారు. ఛలో సినిమా ఇచ్చిన బూస్ట్ తో వెంకీ మరో ప్రేమకథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సారి క్రేజీ హీరో హీరోయిన్స్ ని లైన్లో పెట్టి మరి నితిన్ .. రష్మికలను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. ఈ నెల 25వ తేదీన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సితార బ్యానర్ పై ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా నితిన్ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు.

ఛల్ మోహనరంగ,లై ,కల్యాణ వైభోగం వంటి సినిమాల తరువాత వస్తున్న ఈ సినిమా కావడం. అందువలన సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో నితిన్ వున్నాడు. ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.