//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భీమిలి లో జనసేన జెండా ఎగరేస్తానంటున్న సందీప్ పంచకర్ల..!

Category : state politics

2014 లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి నప్పటి నుంచి.దేశ, రాష్ట్ర రాజకీయాల్లో యువత పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని.అందుకోసం యువత రాజకీయాల్లో అడుగుపెట్టాలని.ఆయన ముందు నుంచి యువతకు పెద్ద పీట వేస్తూ వచ్చారు.అందులో భాగంగానే ఆయన మాటలు,సిద్దాంతాలు నచ్చి.ఓ యువకుడు జనసేన పార్టీ లోకి చేరాడు.ఏం.బీ.ఏ మార్కెటింగ్ హెచ్ ఆర్ చదివి అర్బన్ ప్లానింగ్ గురించి పీ.హెచ్. డీ గీతం యునివర్సిటీ లో చదివి డాక్టరేట్ పట్టా పొందాడు సందీప్ పంచకర్ల.తాను చదువుకున్న విద్యా జనసేన ద్వారా ప్రజలందరికీ ఉపయోగ పడలని కోరుకున్నాడు ఆ విద్యార్థి.అందులో భాగంగానే ఉద్దానం సమస్య పై పవన్ నడుం బిగిస్తే ఆ సమస్య కార్యరూపం దాల్చెందుకు సందీప్ సర్వ శక్తులు ఓడారు.అది గమనించి న పవన్ కళ్యాణ్ ప్రతి విద్యార్థి లో ఇలాంటి మార్పు రావాలని భావిస్తూ..భగత్ సింగ్ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు గా బాధ్యతలు అప్పగించారు. నాయకుడు అప్పగించిన బాధ్యతలను శిరసా వహిస్తూ రాష్ట్రంలోనీ అనేక వేల మంది విద్యార్థులతో ఎప్పటికప్పుడు అనేక సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ఎన్నో వేల మంది యువతను జనసేన లోకి చేరేందుకు తనదైన కృషి చేశారు.

జాగొరే- జాగో ప్రోగ్రాం ద్వారా జనసేన పార్టీ ని అధికారం వైపు తీసుకెళ్లే విధంగా సందీప్ తనదైన కృషి చేశారు. ప్రజా పోరాట యాత్ర పేరిట పవన్ రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉంటే ....పవన్ పర్యటించిన జిల్లాల్లోని ప్రధాన విద్యా సంస్థల స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తూ వారి సమస్యలపై పరిష్కార మార్గాలు చూపించడం కోసం....నేరుగా ఆ స్టూడెంట్స్ నీ పవన్ తో సమావేశం అయ్యేలా.... జనసేన పట్ల వారిలో నమ్మకం ఏర్పడేలా చేయడం లో సందీప్ ప్రధాన భూమిక పోషించారు. ఈ రకమైన సమావేశాల వల్ల విద్యార్డుల్లో నెల కొన్న అనేక ప్రశ్నలకు పవన్ నేరుగా సమాధానం చెప్పడం వల్ల రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి కి జనసేన పై నమ్మకం ఏర్పడేలా పునుకుంది. తద్వారా విద్యార్డుల్లో నెలకొన్న అనేక ప్రశ్నలకు నేరుగా సమాధానం దొరికిందనే చెప్పాలి.

ఈ రకమైన సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించి అటు పవన్ నీ ఇటు స్టూడెంట్స్ కి మధ్య దూరాన్ని మరింత దగ్గర చేశాడు.ఈ నేపధ్యంలోనే సందీప్ లోని నాయకత్వ పటిమను గమనించారు పవన్. ఓ పక్క రాష్ట్రం అంతా పర్యటిస్తున్న సందీప్, గాజువాక నుంచి పోటీ చేస్తున్న పవన్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్టు తీవ్రంగా శ్రమించారు. అధినేత పవన్ సైతం గాజువాక స్థానం నుంచి పోటీ చేయడానికి ముందు కొచ్చరు అంటే అందుకు ప్రధాన కారణం ఆ ప్రాంతంలో సందీప్ తీసుకొచ్చిన మార్పు లే కారణం అని చెప్పుకోవాలి. ఇదంతా గమనిస్తున్న పవన్ గాజువాక పర్యటనకి రావడం ఆయన రాకతో ఆనదంలో ఉన్న సందీప్ కి అధినేత మరో బాధ్యతను అప్పగించడం.

అందులో భాగంగానే సందీప్ నీ తాను చదువుకున్న భీమిలి నియోజక వర్గ స్థానం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గా అధినేత బరిలో నిలపడం విశేషం. అధినేత మాటనే శిరసా వహిస్తూ పవన్ పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు పాల్లు నిజం చేసే విధంగా సందీప్ తీవ్రంగా కృషి చేశారు. తాను విద్యార్థి గా చదువుకున్న భీమిలి స్థానం నుంచే తాను ఎమ్మెల్యే గా పోటీ చేయడం. స్థానిక యువకుల్లో సైతం గర్వించదగిన విషయం.ఈ సారి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న రెండు పార్టీ ల అభ్యర్థులు గతంలో ఏంపి లుగా పని చేసిన వారు కావడం. వీరిద్దరికీ సందీప్ బలమైన పోటీనే ఇవ్వబోతున్నాడు.ఇప్పటికే ముగిసిన పోలింగ్ లో సైతం జనసేన కు మంచి ఓటింగ్ హే నమోదు కావడం హర్షించదగ్గ విషయం. చూడాలి మరి సందీప్ ఎమ్మెల్యే గా గెలిచి పవన్ తో పాటు అసెంబ్లీ లో అడుగు పెడతాడా లేదా అనేది.