//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భీమిలి అందాలు ఆహ్వానిస్తున్నాయ్

Category : state

విశాఖపట్టణం అంటే అందరికీ తెలుసు మరి భీమునిపట్నం ఎంతమందికి తెలు సు.. ప్రకృతి అందాలతో, చారిత్రక కట్టడాలతో, సాంస్కృతిక వికాసంతో , నదీమ తల్లి హొయలతో, సాగరుని లయలతో కనువిందు చేసేది భీమిలిగా పిలువబడే భీమునిపట్నం. విశాఖ నుంచి భీమిలి 24 కి.మీ. దూరంలో ఉండే అద్భుత పర్యాటక ప్రాంతం భీమిలి. ఇంతగా చెప్పేందుకు భీమిలిలో ఏముంది అని ఆలోచిస్తున్నారా ... అయితే భీమిలి అందాలు మీ కోసం Bheemili beach tourism information

విశాఖ కన్నా ముందే ఓ పెద్ద పట్టణంగా, చారిత్రక ప్రాంతంగా విలసిల్లినది భీమిలి. ఈ పట్టణం.. తర్వాత కాలంలో కాస్త మరుగునపడింది. కానీ, ఇప్పటికీ అక్కడ చూడదగ్గ, ఆస్వాదించదగ్గ విశేషాలు ఎన్నో ఉన్నాయి. గతమెంతో ఘనం అనిపించే .ఆ ఘనమైన చరిత్రను గుర్తు చేసుకునే వేడుకలు ఇప్పుడు భీమిలిలో జరగనున్నాయి. పర్యాటకులను రారమ్మని పిలుస్తున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులపాటు భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారంటే 1861లో భీమునిపట్నం పురపాలికగా గుర్తింపు పొందింది. దేశంలో పురపాలక సంఘంగా ఏర్పడిన రెండో పట్టణమిది. ఇది ఏర్పాటై 150 ఏళ్లయిన సందర్భంగా 2010 నుంచి ఏటా భీమిలి ఉత్సవాలు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా జరుగుతున్నాయి. Bheemili beach tourism information

భీమిలి ఉత్సవ విశేషాలు చూస్తే ఉప్పుటేరులో తెప్పల పోటీలు తెగ సందడి చేస్తాయి. కుర్రకారు జోరు చూపించే కబడ్డీ ఆటలు, భీమిలి ప్రత్యేక వంటకాల రుచులు ఘుమ ఘుమలతో స్వాగతం పలుకుతాయి. , రంగవల్లులతో ఊరంతా అందమైన హరివిల్లుగా దర్శనమిస్తుంది. డప్పుల హోరు, పులివేషాల జోరు, సంప్రదాయ కళల ప్రదర్శనలు, సినీకళాకారుల అభినయాలు, సంగీత విభావరులు ఒకటేమిటి రెండు రోజుల పాటు ఆహ్లాదాన్ని , ఆనందాన్ని పొందాలంటే భీమిలి వెళ్ళాల్సిందే మరి.Bheemili beach tourism information

అంతే కాదు తూర్పుతీరంలో అతి ప్రాచీనమైన ఓడ రేవు భీమునిపట్నం (భీమిలి) లోనే వుంది . దేశంలో రెండో పురాతన మునిసిపాలిటీ అయిన భీమిలిలో డచ్‌ పాలకులకు చెందిన సమాధులు, పురాతన లైట్‌హౌస్‌, 1864లో నిర్మించిన సెయింట్‌ పీటర్స్‌ చర్చి ఇక్కడ చూడదగిన పర్యాటక ప్రాంతాలు. సముద్రంలో గోస్తనీ నది ఈ ప్రాంతంలోనే కలుస్తుంది. నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. భీమిలిలో వుడా గెస్ట్‌హౌస్ కూడా ఉంది .

విశాఖపట్నం-భీమిలి బీచ్‌ రోడ్డులో ఎర్రమట్టి దిబ్బలున్నాయి. వేల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయని ఆంత్రోపాలజిస్టులు గుర్తించారు. దేశంలో ఇంత పెద్ద ఎర్రమట్టి దిబ్బలు ఇంకెక్కడా లేవు. వీటిని వారసత్వ సంపదగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. పర్యాటక శాఖ ఇక్కడ వ్యూ పాయింట్‌ నిర్మించింది. తెలుగు, తమిళ భాషలకు సంబంధించి అనేక సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు అంటే వాటి అందాలు ఏ పాటివో మనం అర్ధం చేసుకోవచ్చు .బౌద్ధమతానికి సంబంధించి బలమైన ఆనవాళ్లున్న ప్రాంతాలు బావికొండ, తొట్లకొండ. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో తొట్లకొండ ఉంది. అక్కడకు మరో కిలోమీటరు దూరంలో బావికొండ ఉంటుంది. బుద్ధుని ధాతువు తో కూడిన భరిణె అక్కడ లభ్యమయింది. తొట్లకొండ కొండ దిగువన తీరంలో ఇటీవల రిసార్ట్స్‌ నిర్మించారు. ఇన్ని అందాల, ఇన్ని విశేషాల, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే భీమిలి పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తుంది.Bheemili beach tourism information

Related News