//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సూపర్ హిట్ అయ్యింది...కానీ

Category : national

ఈ రోజు బెంగళూరు నగర శివార్లలోని తుమకూరు రోడ్డులోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ పరివర్తనా యాత్ర కార్యక్రమం చేప‌డుతోంది. ఇందులో పాల్గొన‌డానికి జాతీయ రహదారి మీదుగా అతి భారీగా కార్య‌క‌ర్త‌లు, అభిమానులు చేరుకుంటున్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే అనూహ్యంగా శ్రేణులు కదిలి రావడంతో బెంగళూరు-తుమకూరు జాతీయ రహదారిలో కిలోమీటర్ల మేర‌ ట్రాఫిక్ జామ్ అయింది. 

బెంగ‌ళూరుకి వ‌చ్చిన అమిత్ షా రోడ్డు మార్గంలో వెళ్లి కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌నుకున్నారు. వాహ‌నాలు ముందుకు క‌దిలే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో అమిత్ షా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే చాలాసేపు ఉన్నారు. 

ఒకరకంగా చూస్తే లక్షల్లో జనం వచ్చినందుకు బీజేపీ నాయకులు సంబర పడాలో లేక సభలో పాల్గొనాల్సిన బాస్ విమానాశ్రయంలోనే ఉండిపోయాడని భాద పడాలో తెలియని పరిస్థితిలో భాజాపా శ్రేణులు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షాను అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానం దగ్గరకు తీసుకెళ్లారు. మ‌రోవైపు భారీగా  ట్రాఫిక్ జాం కావడంతో అంబులెన్స్ లు కూడా ముందుకు క‌ద‌ల‌డం లేదు. దీంతో రోగులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.