//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భరత్ అనే నేను సినిమా కథతో మొదలైన గల్లా జయదేవ్ ప్రసంగం...!

Category : politics

కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఇటీవలి బ్లాక్ బస్టర్ హిట్ 'భరత్ అనే నేను' ప్రస్తావనతో ఆసక్తికరంగా ప్రారంభించారు ఎంపీ గల్లా జయదేవ్. ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి చనిపోవడంతో విదేశాల నుంచి వచ్చిన భరత్ అనే యువకుడు, అనూహ్య పరిస్థితుల్లో డైనమిక్ సీఎంగా మారతారని గుర్తు చేశాడు.

తన తల్లి సూచించినట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయతే ప్రధానంగా పనిచేయడం కథాంశంగా చిత్రం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ప్రతిబింబించడంతోనే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిందని అన్నారు.

ప్రస్తుత పాలకుల్లో అటువంటి విశ్వసనీయత కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఏ విధమైన హామీ నెరవేరలేదని, ఆయన ఇచ్చిన మాటను తప్పారని ఆరోపించారు.