//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సుడిగాలి సుధీర్ నిర్ణ‌యంతో.. యాంక‌ర్‌ను మార్చేసిన యాజ‌మాన్యం..!

Category : movies

ప్ర‌ముఖ బుల్లితెర ఛానెల్లో ప్ర‌సార‌మ‌వుతూ, మంచి రేటింగ్స్ మ‌రియు ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను సొంతం చేసుకుని విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న ప్రోగ్రామ్ ఢీ. అయితే, ఇటీవ‌లే డీ 10వ సీజ‌న్‌ను పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం డీ జోడీ పేరుతో మ‌రొక సీజ‌న్‌ను మొద‌లు పెట్టింది ఆ ఛానెల్‌.

అయితే, ఎప్ప‌టి లాగానే ఇందులో సుధీర్ ఉన్నాడు. సుధీర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. లేడీ హోస్టింగ్ నుంచి ర‌ష్మీని తొల‌గించి బిగ్‌బాస్‌లో ఇటీవ‌లె ఫేమ‌స్ అయిన భాను శ్రీ‌ని పెట్టారు. ఇక భాను శ్రీ సుధీర్ జోడీల‌తో మంచి జోరుగా కొన‌సాగుతున్న ఈ సీజ‌న్ కొన్ని రోజుల్లోనే భాను శ్రీ‌ని షోనుంచి త‌ప్పించ‌బోతున్నార‌న్న వార్త కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. దీనికి సంబంధించి ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గామారి సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇక అస‌లు మ్యాట‌రేంటంటే.. ఢీ జోడీ మొద‌లుపెట్టిన‌ప్ప‌ట్నుంచి ఎంతో మంది స‌భ్యులు, ప్ర‌జ‌లు భాను శ్రీ యాక్టింగ్ బాగుంద‌ని పొగుడుతున్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ రేష్మీనే సుధీర్ ప‌క్క‌న జోడీగా తీసుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన కామెంట్స్ పెడుతున్నార‌ట‌. అయితే, ఈ కామెంట్ల‌తో కాస్త ఆలోచ‌న‌లో ప‌డ్డ ఆ షో నిర్మాత‌లు మ‌ల్లీ ర‌ష్మీనే తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. మ‌రి ర‌ష్మీ ఎంట్రీతో భాను శ్రీ ఎగ్జిట్ అవుతుందా..? లేక ర‌ష్మీ ప‌క్క‌న సీటులో స‌ర్ద‌కు పోతుందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క‌త‌ప్ప‌దు మ‌రీ.