అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈ రోజూ భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరులో భారత్ 131 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టోర్నీలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఢీకొట్టింది.
ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పృథ్వీ షా(40), శుభ్నమ్ గిల్(86), అభిషేక్ శర్మ(50) బ్యాటింగ్‌లో రాణించడంలో భారత జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది మిగతా ఆటగాళ్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఐదుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం గమనార్హం. బంగ్లా బౌలర్లు క్వాజి ఒనిక్(3), నయీమ్ హాసన్(2), సైఫ్ హాసన్(2) ధాటికి భారత్ 49.2 పరుగులకు ఆలౌటై 265 పరుగులు చేసింది.
266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆది నుంచి తడబడింది. భారత్ బౌలర్లు నాగర్ కోటి(3), శివమ్ మావి(2), అభిషేక్ వర్మ(2) రాణించడంతో ఆ జట్టు 42.1 ఓవర్లలో 134 పరుగులకే చేతులెత్తేసింది దీంతో భారత్ 131 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది ఈ నెల 30న జరగనున్న సెమీఫైనల్-2లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ మధ్య ఈ నెల 29న సెమీఫైనల్-1 జరగనుంది.