//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భైర‌వ గీత కొత్త ట్రైల‌ర్ రివ్యూ..!

Category : movies

రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌ణ‌లో ఆయ‌న శిష్యుడు సిద్ధార్థ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం భైర‌వ‌గీత‌. సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో ఇంటెన్స్‌, ఎమోష‌న్స్‌తో క‌ల‌గ‌లిపి తెర‌కెక్కిన ఈ సినిమా కొత్త ట్రైల‌ర్ నిన్న విడుద‌లైంది. మంచి డైలాగ్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌, ఎమోష‌న్స్‌, రొమాన్స్ ట్రైల‌ర్‌లో క‌నిపిస్తున్నాయి. సౌత్ సినీ ఇండ‌స్ట్రీలోని నాఉల‌గు భాష‌ల్లో ఈ చిత్రం ఈ నెల 22న విడుద‌ల అవుతుంది.

రాములోరు జింకెంట ప‌డిపోతేనేగా రావ‌ణుడొచ్చి సీత‌మ్మ‌ను ఎత్త‌కు పోయాడు. ఇప్పుడు ఈ గీత‌మ్మ‌ను ఎవ‌డ‌న్నా ఎత్తుకుపోతే ఏం చేసేది. అలాగే, హీరో ప‌లికిన మా అయ్య బాటే నాబాట‌. ప్రాణం ఇచ్చినా.. తీసినా అది సుబ్బారెడ్డి అయ్య‌గారి కోస‌మే. ఎన్నిగుండెలుంటే నా బిడ్డ మీద చెయ్యేస్తాడు అంటూ విల‌న్ ప‌లికిన సంభాష‌ణ‌లు ఈ రోజు నొప్పి నీకు తెలిసినాది, నిన్న మాకు, రేపెవ‌నికో అని, అలాగే, మ‌నిషిని బానిస‌గా చూసే ప్ర‌తీ ఒక్క‌ని గుండెల్లో దింపే క‌త్తే దీనికి స‌మాధానం అంటూ ట్రైల‌ర్‌లో చూపించిన సంభాష‌ణ‌లు వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.