జనం అమాయకత్వాన్ని తెలుసుకుంటే ఎలాంటి వారిని అయినా మోస౦ చేయవచ్చు. డబ్బుకి ఆశ పడని వారు ఎవరు ఉంటారు చెప్పండి..? అందుకే మాసంలో కూడా చాలా రకాలు వచ్చాయి. మోసం చెయ్యడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగానే మోసాలు చేస్తున్నారు కొందరు ప్రభుద్దులు. అయితే దుబాయ్ లో ఒక వాట్సాప్ మెసేజ్ అక్కడి పౌరుల బ్యాంకు ఖాతాలను కాళీ చేసింది.
‘మీరు లులు హైపర్ మార్కెట్ నుంచి 2లక్షల దిర్హమ్స్ బంపర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. మీ వివరాలను తెలియజేసి ప్రైజ్ మనీని తీసుకోండి..’ అంటూ వాయిస్ మెసేజ్ యూఏఈలో బాగా సర్క్యులేట్ అవుతోంది. దీనికి స్పందించి చాలా మంది ప్రజలు పెద్దమొత్తంలో డబ్బును పోగొట్టుకున్నారు. దీనిపై యూఏఈ పోలీసులు కీలక ప్రకటన ఒకటి విడుదల చేశారు. వాట్సప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ వాయిస్ మెసేజ్ అంతా ఒట్టిదేననీ, దీనికి స్పందించి డబ్బును నష్టపోవద్దని సూచించారు. వాయిస్ మెసేజ్‌లో చెప్పిన బ్యాంకు పేరుతోనే గతంలో పలు మోసాలు జరిగాయనీ, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలను కోరారు.