//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కెసిఆర్ తెరిచే మూడో కన్ను ఇదే..

Category : politics

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెసిఆర్ ఓ సభలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

బిడ్డా ! చంద్రబాబు నేను మూడో కన్ను తెరిస్తే ఎట్లా ఉంటదో చూపించనా ? మూడో కన్ను తెరవనా ? తెలంగాణతో పెట్టుకుంటే ఎట్ల ఉంటదో ఒకసారి దెబ్బ చూపించిన ఆ దెబ్బతో విజయవాడ కరకట్ట మీద పడ్డావ్ బిడ్డా ….. చీ నీతో పొత్తా ? అంటూ ఓ ముఖ్యమంత్రిని కెసిఆర్ విమర్శించడంతో స్థానికులు, సెటిలర్స్ కేసీఆర్ పై మండి పడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 9 సంవత్సరాలు సేవలు అందించిన ఓ ముఖ్యమంత్రిని, హైదరాబాద్ ని ఓ రేంజ్ లో డెవలప్ చేసిని ఓ నాయకుడిని, వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఓ మనిషిని, కెసిఆర్ ఇలా విమర్శించడంపై నిప్పులు చేరుగుతున్నారు పలువురు నెటిజన్లు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అలా పొత్తుపెట్టుకున్నందుకు చంద్రబాబు ని ఘోరంగా అవమానించాడు కెసిఆర్. ఇక కెసిఆర్ అన్నమాటలకి నీ మూడో కన్ను ఇదే అంటూ మద్యం బాటిల్ ని ముఖంమీద పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో కెసిఆర్ పై కామెంట్స్ రూపంలో విమర్శలు వస్తున్నాయి.

Related News