//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోషల్ మీడియాలో జాగ్రత్త

Category : technology

ఆంధ్రప్రదేశ్ లో తప్పుడు ప్రచారాలు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం ఇప్పుడు అమాయకుల పాలిట శాపంగా మారింది. సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం తో కొందరు దాడులు చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగురోజుల క్రితం శంకరప్పకు చెందిన 9652464253 నెంబర్‌ నుంచి హిందూపురం, ప్రాంతం కొల్లకుంట, ముద్దిరెడ్డిపల్లి, సింగరెడ్డిపల్లి ప్రాంతాల్లో...

ఇలాంటి ముఠాలు సంచరిస్తున్నాయని పోలీస్‌ శాఖ పేరుమీద వాట్స్‌పలో మెసేజ్‌లు పెట్టి షేర్‌ చేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టి సాంకేతిక పరంగా గుర్తించి దీనిపై కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్‌ సీఐ చిన్నగోవిందు గురువారం తప్పుడు సమాచారం పంపిన శంకరప్పను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డిఎస్పీ తెలిపారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు సమాచారంను వా ట్సప్‌, ఫేస్‌బుక్‌,ల్లో పంపినవారిపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. అదే విధంగా అనుమానితులుగా ఎవరినైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలి తప్పా చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకుడదన్నారు.